కవిత ఫోన్స్ ఓపెన్… టెన్షన్ పెడుతున్న కొత్త డౌట్స్ ఇవే!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆరెస్స్ ఎమెల్సీ కవిత ఫోన్లపై ఈడీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఐఎంఈఐ నంబర్లతో సహా ఏడాది కాలంలో కవిత వాడిన ఫోన్ల వివరాలను చార్జిషీట్లలో ఈడీ పేర్కొంది కూడా. దీంతో… ఆ ఫోన్లతో పాటు గతేడాది అక్టోబరు నుంచి వాడుతున్న ఫోన్ లను కూడా ఈ నెల 21న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు కవిత. దీంతో… కవిత వాడినట్లు చెబుతున్న పది మొబైల్స్ ఇప్పుడు ఈడీ చేతికి చేరాయి. ఫలితంగా… ఈడీ ఆరోపించినట్టుగానే ఏడాది కాలంలో పది ఫోన్లను వాడింది నిజమేనని… వాటిని హాండ్ ఓవర్ చేయడం ద్వారా కవిత తనంతట తానుగా ఓప్పుకున్నట్టయింది! అయితే తాజాగా వీటిని ఓపెన్ చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు అదే హాట్ టాపిక్!!

కవిత వాడిన ఫోన్లలోని కొన్ని వివరాలను ఫోన్లను అప్పగించకముందే ఈడీ సేకరించడంతో.. వాటి ఆధారంగానే చార్జిషీట్లలో కొన్ని అంశాలను పొందుపరిచింది. అయితే తాజాగా కవిత హ్యాండ్ ఓవర్ చేసిన ఫోన్లకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంది ఈడీ. అందులో భాగంగా… కవితకు మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో.. ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయన సమక్షంలో ఈడీ అధికారులు కవిత ఇచ్చిన ఫోన్లను ఓపెన్ చేశారు.

దీంతో… ఆ ఫోన్లలో ఈడీ ఆశిస్తున్న ఎవిడెన్సులు ఉన్నాయా? వాటిలోని డేటా పదిలంగానే ఉందా? ఈడీ ఆరోపిస్తున్న, కవిత విషయంలో అనుమానిస్తున్న అంశాలకు ఆధారలేమైనా దొరికాయా? ఆమె హాండ్ ఓవర్ చేసిన ఫోన్లు గతంలో ఆమె వాడినవేనా? వంటి అనేక సందేహాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై అటు ఈడీ అధికారులు గానీ, ఇటు కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌‌ గానీ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

అయితే… కవిత తాజాగా సబ్ మిట్ చేసిన ఫోన్ లలో అప్పటికే ఈడీ సేకరించిన డేటా డిలీట్ అయి ఉంటే… “తమ దగ్గర ఇప్పటికే ఉన్న డాటా ఈ ఫోన్లలో లేదని, డిలీట్ అయిపోయిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని” ఈ ఆధారాలతో ఈడీ కోర్టులో రుజువు చేసే అవకాశం ఉంది. అలా కకుండా… డిలీట్ అయిన డేటా కూడా ఈడీ రికవర్ చేయగలిగితే… ఇక చెప్పేదేముంది?

దీంతో మరోసారి కవితను ఈడీ విచారణకు పిలిస్తే… ఆ రోజు “ఫోన్స్ వ్యవహారం, అందులో అప్పటికే ఈడీ సంపాదించిన డేటా – కవిత సబ్ మిట్ చేశాక కనిపించకుండా పోయిన డేటా” ఆధారంగానే ప్రశ్నలు ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. దీంతో కొత్త టెన్షన్ కి గురవుతున్నారు బీఆరెస్స్ శ్రేణులు!