లాక్కోలేక.. పీక్కోలేక.. గిలగిల్లాడుతున్న సూపర్ స్టార్

Don't bother me : rajinikanth

తెరపై చూపించే రాజకీయం వేరు. అది నటన. రాత్రికి రాత్రి ఓ హీరో తెర మీద ముఖ్యమంత్రి అయిపోగలడు. రాజకీయ పార్టీ పెట్టేసి.. జనంలోకి వెళ్ళపోయి, ముఖ్యమంత్రో.. ప్రధానమంత్రో అయిపోవడం సినిమాల్లో చెల్లుతుంది. నిజ జీవితంలో అది అంత తేలిక కాదు. ఆ విషయం చాలా లేటుగా తెలుసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇదిగో, రాజకీయ పార్టీ పెట్టేస్తున్నానంటూ దాదాపు రెండు దశాబ్దాలపాటు ఊరించిన రజనీకాంత్, ఈ మధ్యనే తాజాగా ఉస్సూరుమనిపించారు. ఇంకేముంది, అభిమానులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు రజనీకాంత్, ‘సరే.. ఆలోచిస్తాను..’ అనేవారు. కానీ, ఇప్పుడు ససేమిరా అనేస్తున్నాడాయన.

Don't bother me : rajinikanth
Don’t bother me : rajinikanth

‘నన్ను ఇబ్బంది పెట్టకండి’ అంటూ రజనీకాంత్ తాజాగా అభిమానుల్ని ఉద్దేశించి ప్రకటన చేయడం గమనార్హం. ఎవరు ఎవర్ని ఇబ్బంది పెడుతున్నట్టు.? ‘వ్యవస్థలో మార్పు అవసరం’ అని రాజకీయ ఆశలు అభిమానుల్లో రేకెత్తించింది రజనీకాంతే. ఆయనే, ఇప్పుడు రాజకీయాలు వద్దంటున్నారు. ఆయన అవసరానికి రాజకీయ మాటలు చెప్పారు.. సినిమాల్లో రాజకీయ అంశాల్నీ ప్రస్తావించారు. ఇప్పుడేమో అనారోగ్యం సాకుగా చూపి, చేతులు దులిపేసుకున్నారు. నిజమే, రజనీకాంత్ ఆరోగ్యం ఆయన రాజకీయ జీవితానికి సహకరించకపోవచ్చు. కానీ, ఇవన్నీ తెలుసుకోకుండానే రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం రాజకీయ ప్రకటన చేసేశారని ఎలా అనుకోగలం.? తన స్థాయిని తానే దిగజార్చేసుకున్న రజనీకాంత్, అభిమానుల మనసుల్ని ఇకపై ఇదివరకటి స్థాయిలో గెలుచుకోవడం కష్టం. అది ఆయనకీ తెలుసు. ఇకపై రజనీకాంత్ సినిమాలకి జేజేలు మాత్రమే కాదు, నిరసనలు కూడా తప్పకపోవచ్చు. ఇదంతా ఆయన చేసుకున్న స్వయంకృతాపరాథం. దేశ చరిత్రలో ఏ సినీ ప్రముఖుడూ ఊరించనంతలా అభిమానులను ఆయన ఊరించారు.. రాజకీయ రంగ ప్రవేశమంటూ. ఇప్పుడు ఉస్సూరుమనిపించేస్తే ఇలాగే వుంటుంది మరి.