డెవిల్ మూవీ రివ్యూ
నేతాజీ కలలు కన్న సమాజం కోసం విప్లవం. ఉద్యమం అని ప్రతిఘటించిన కాలం నాటి కథ . ఈ వారం విడుదలైన DEVIL చిత్రం.
కథ :
రాసపాడు దివాణంలో జరిగిన హత్య. ఎవరు చేసారో తెలీదు. అది కనుక్కునే ప్రయాణంలో DEVIL (నందమూరి కళ్యాణ్ రామ్ ) వస్తాడు. Secret agent అయిన DEVIL అసలు ఈ దివాణం లో జరిగిన హత్య కోసం రావటం ఏంటి ? అసలు నైషద (సంయుక్త) ఎవరు ? మాళవిక నాయర్ కి నేతాజీ కి ఉన్న సంబంధం ఏంటి ? అసలు హత్య ఎందుకు జరిగింది ? DEVIL కళ్యాణ్ రామ్ అసలు కనుక్కున్న నిజాలు ఏంటి ? అబద్ధాలు ఏంటి ?చూడాలంటే , తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
బాగున్న అంశాలు :
చిత్ర నేపథ్యం మొత్తం బ్రిటీష్ కాలం నాటి కధలా చెప్పటం బాగుంది . నందమూరి కళ్యాణ్ రామ్ నటన బాగుంది. కొత్త స్క్రిప్ట్స్ ఎలాంటి బెరుకు లేకుండా నటించటం కళ్యాణ్ రామ్ కి అలవాటైపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి సంగీతం అందించాడు.
ఇబ్బంది పెట్టె అంశాలు:
డైరెక్టర్ నవీన్ మేడారం కథని పేపర్ మీద రాసుకున్న విధానం బాగుందేమో, కానీ చిత్రీకరించిన వైనం అంత గొప్పగా లేదు. కధలో twists ముందే ఊహించేంత బేలగా ఉంది ఆర్టిస్ట్స్ నటన, మరియు డైరెక్షన్ . మాళవిక నాయర్, సంయుక్త మీనన్, ఎస్తేర్, అంతా వారి వారి పరిధిలో నటించారు. ఇంకాస్త మంచి నటించే అవకాశం ఈ కధలో ఉంది, కానీ డైరెక్టర్ అంత మేర వారికీ అవకాశం ఇచ్చినట్టు కనపడలేదు. తమ్మిరాజు గారు ఎడిటింగ్ పర్లేదు అన్నట్టు ఉంది, చాల మంచి కాన్సెప్ట్ తెరమీద ఎందుకనో తేలిపోయింది.
మొత్తంగా డెవిల్ మూవీ రివ్యూ :
DEVIL చిత్రం కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన కథనాలను , కధలను ఎన్నుకునే విధానాన్ని మరో సారి తెలియారిచేలా ఉంది. కానీ నేతాజీ పేరుని వాడుకున్నంతగా , ఆ పోరాట స్ఫూర్తి ఈ చిత్రం లో కనపడదు. అసలు ఆర్టిస్ట్స్ అంత మంది ఉన్నా ఎవరు మనకి గుర్తుండిపోయే నటన లేదు అంటే నిజమనే చెప్పాలి. మొదటి సారి సత్య కామెడీ టైమింగ్ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. సీత (పూర్వపు చిత్రాల హీరోయిన్) అసలు ఈ చిత్రం లో ఎందుకున్నారో ఆవిడ రోల్ ఎందుకనో తెలీదు. అజయ్, శ్రీకాంత్ ఐయాంగర్ characterలు ఇంకా బాగా ఎలివేట్ చేసే ఆస్కారం ఉండి కూడా డైరెక్టర్ పట్టించుకోలేదు అన్నట్టే ఉంది. Murder mystery లా మొదలై , అసలు ఆ murders చుట్టూ కాకుండా డైరెక్టర్ వేరే అంశం తెరపైకి తీసుకురావటం కాస్త ఇబ్బంది పెడుతుంది.
కధలో మలుపులు మనకి కాస్త ముందుగానే తెలిసిపోతుండటం వల్ల చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా మలచలేకపోయాడు నవీన్. మంచి నేపధ్యం ఎన్నుకుని , మంచి పోరాటాలు చూపించి , మంచి చిత్రం గా మిగిలే అవకాశాన్ని DEVIL చిత్రం మిస్ అయిందనే చెప్పాలి అందుకే ఈ చిత్రానికి మా రేటింగ్.
2/5
పవన్ దావులూరి