మెగాస్టార్ చిరంజీవి ఇకపై అన్నీ మల్టీస్టారర్ సినిమాలే చేస్తారా.? అంటే, ఔననే చెప్పొచ్చేమో. ‘ఆచార్య’ మల్టీస్టారర్. ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, చిరంజీవితో కలిసి నటించిన దరిమిలా, దాన్నీ మల్టీస్టారర్‌గానే పరిగణించాలేమో. ‘వాల్తేరు వీరయ్య’ సంగతి సరే సరి.
వాట్ నెక్స్‌ట్.? ‘భోళా శంకర్’ విడుదల కావాల్సి వుంది. అది మాత్రం మల్టీస్టారర్ కాదు. ఆ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలు మాత్రం మళ్ళీ మల్టీస్టారర్లేనట.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ఇది కూడా మల్టీస్టారర్ కథాంశమేనన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చిరంజీవి చేయాల్సి వున్నా, అది ఇప్పట్లో కష్టం. ఒకవేళ వచ్చినా.. అదీ మల్టీస్టారరే అవుతుంది.
చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచన వున్న చాలామంది దర్శకులు.. అందునా యంగ్ డైరెక్టర్స్, ఎక్కువగా మల్టీస్టారర్ కథాంశాలపైనే ఫోకస్ పెడుతున్నారట. అన్నట్టు, వినాయక్ కూడా చిరంజీవికి ఓ మల్టీస్టారర్ కథ చెప్పాడని అంటున్నారు.