కడిగి పారేస్తున్న చిరంజీవి.! కిమ్మనలేకపోతున్న కొరటాల శివ.!

చిరంజీవి నన్నే టార్గెట్ చేస్తున్నారా.? అన్న డౌట్ క్రమంగా బలపడిపోతోంది దర్శకుడు కొరటాల శివకి. కానీ, ఆయన ఎవరి దగ్గరా ఈ మాట చెప్పలేని పరిస్థితి.

‘ఛ..ఛ.. చిరంజీవి అలాంటి వ్యక్తి కాదు’ అని కొరటాల శివ మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంటున్నారు. ‘ఎవర్నో ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయడంలేదు. పరిశ్రమ బాగు కోసం.. ఓ అనుభవం వున్న నటుడిగా ఈ మాటలు చెబుతున్నా.. దయచేసి మీరు ఎవర్నీ ఇబ్బంది పెట్టేలా కట్టు కథలు అల్లొద్దు..’ అని కూడా చిరంజీవి, మీడియాకి చెప్పారు తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్‌లో.

కానీ, చిరంజీవి వ్యాఖ్యలు నేరుగా కొరటాలకే తాకుతాయన్నది మీడియాలో వినిపిస్తున్న కథనాల సారాంశం. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా కొరటాల శివతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి, ఎన్టీయార్‌తో ప్రాజెక్ట్ సూపర్ హిట్ అవ్వాలని చిరంజీవి తన ఆకాంక్షని కొరటాల దగ్గర వ్యక్తం చేశారట. అంతే తప్ప, ఇందులో కొరటాల కిమ్మనలేకపోవడం ఏమీ లేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.