చిరంజీవి, బాలకృష్ణ.! ఎవరి రెమ్యునరేషన్ ఎక్కుడ.?

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తోపాటు, నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో బాలయ్య సినిమాకే క్రేజ్ ఎక్కువ కనిపిస్తోంది ప్రస్తుతానికి.

తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య సినిమాకే హంగామా కనిపిస్తోంది. ఇంతకీ, రెమ్యునరేషన్ల పరంగా ఎవరెక్కువ.? నిజానికి, స్టార్‌డమ్ పరంగా చూసుకుంటే, మెగాస్టార్ చిరంజీవే నెంబర్ వన్.. బాలకృష్ణది ఆ తర్వాతి స్థానమే సీనియర్ హీరోల్లో.

కానీ, ‘అఖండ’ సినిమాతో లెక్కలు మారాయ్. ఆ స్థాయి విజయాన్ని ఇటీవలి కాలంలో చిరంజీవి నమోదు చేయలేదు. అయితే, ‘అఖండ’కి ముందు బాలయ్య చాలా ఫ్లాపులు చూశారనుకోండి.. అది వేరే సంగతి. చిరంజీవి కెరీర్ ఫ్లాపులు, హిట్లుకీ అతీతంగా సాగింది ఒకప్పుడు.

‘ఆచార్య’ దెబ్బతో అన్నీ మారిపోయాయ్. అయినాగానీ, రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే చిరంజీవికే చాలా చాలా ఎక్కువ ఇచ్చారట బాలకృష్ణ కంటే ‘మైత్రీ’ నిర్మాతలు. ఆ ఫిగర్ ఎంతన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయితే, సినిమా రిలీజ్ అయ్యాక రెమ్యునరేషన్ లెక్కలు చూసుకుందాం.. అని కేవలం అడ్వాన్సుతోనే సరిపెట్టారట చిరంజీవి.