నమ్మకున్నోళ్ళని నిండా ముంచేసిన చంద్రబాబు.!

Chandrababu backstabs TDP Cadre, In style

Chandrababu backstabs TDP Cadre, In style

పరిషత్ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. కానీ, దాదాపు అన్ని చోట్లా టీడీపీ అభ్యర్థులు బరిలోనే వున్నారు. ప్రచారం కోసం అభ్యర్థులు నానా తంటాలూ పడుతున్నారు. పార్టీ అధిష్టానం, పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించింది కదా.? అన్న ప్రశ్నకు అభ్యర్థుల నుంచి సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ‘ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏడాది క్రితమే సన్నాహాలు చేసుకున్నాం.. ఖర్చు చేశాం కూడా. మేం ఖర్చు చేయడం సంగతి పక్కన పెడితే, మా కోసం కార్యకర్తలు కష్టపడ్డారు. వారందరికి మేం ఏం సమాధానం చెప్పుకోవాలి.?’ అన్నది టీడీపీ అభ్యర్థుల వాదన. గెలుస్తామన్న నమ్మకం లేని కొందరు అభ్యర్థులు మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వున్నారు. ఆయా స్థానాల్లో పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకున్న నేతలు, ఎలాగైనా పరిషత్ ఎన్నికల్లో తమ సత్తా చూపాలనుకుంటున్నారు. నిజానికి, ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఏడాది క్రితం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ అనివార్యమైన కారణాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో కోర్టు తీర్పులెలా వుంటాయి.? ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఎంత.? అధికార పార్టీ చేస్తున్న అక్రమాలేంటి.? ఇవన్నీ వేరే అంశాలు.

ఓ రాజకీయ పార్టీ, ప్రజలకు వద్దకు వెళ్ళేందుకు ఎన్నికలు అత్యంత కీలకమైన సందర్భం. ప్రధాన ప్రతిపక్షానికి ఈ విషయంలో బాధ్యత చాలా చాలా ఎక్కువ. ప్రజలంటే లెక్కలేదు.. మునిసిపల్ ఎన్నికల్లో ఓటర్లను చంద్రబాబు స్వయానా తిట్టేశారు గనుక.. ఓటర్లకు మల్ళీ మొహం చూపించుకోలేక చంద్రబాబు, పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేశారు. కానీ, నాయకులు అలా కాదు కదా.! చంద్రబాబుని నమ్ముకుని నిండా ముంచేశారు. చంద్రబాబుకి ఇవన్నీ అలవాటైన వ్యవహారాలే మరి.