పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌.. బీజేపీ నెత్తిన ‘గ్రేటర్‌’ పిడుగు

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో గెలిచి, మేయర్‌ పీఠం దక్కించుకుంటే, పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటోంది. ఇదెక్కడి విడ్డూరం. సర్జికల్‌ స్ట్రైక్‌ అనగానే పాకిస్తాన్‌పై వ్యూహాత్మకంగా చేసిన దాడి అందరికీ గుర్తుకొస్తుంటుంది. అది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన వ్యవహారం. దాన్ని, పాత బస్తీకి ఎలా లిక్‌ చేయగలుగుతారు.? గ్రేటర్‌ ఎన్నికల కోసం బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపేందుకోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రదర్శించిన అత్యుత్సాహమే ఈ ‘పాత బస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌’ వ్యాఖ్య.

Surgical strike on old Basti .. BJP's bloody 'Greater' thunder
Surgical strike on old Basti .. BJP’s bloody ‘Greater’ thunder

బీజేపీని నిండా ముంచేస్తోన్న బండి సంజయ్‌

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కి షాకిచ్చిన బీజేపీ, ఆ ఉత్సాహంతోనే గ్రేటర్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కి షాకివ్వాలనుకుంటోంది. అయితే, ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హద్దులు మీరి సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద కోణంలో చేసేస్తుండడం బీజేపీ శ్రేణుల్ని సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏ పార్టీ అయినా ఓ వర్గం ఓట్లతో గట్టెక్కేయాలనుకోవడం హాస్యాస్పదం. పాత బస్తీ అంటే, అక్కడ వుండేది కూడా భారతీయులే కదా.! మరి, ఎవరి మీద సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారట.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద ఘటన జరిగినా, దానికి హైద్రాబాద్‌తో లింకు వుండేది ఒకప్పుడు. అలాగని, మన పౌరుల్ని మనం అవమానించగలమా.? వారిపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయగలమా.? ఏ ఉద్దేశ్యంతో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేసినా, అవి రెచ్చగొట్టే వ్యవహారాల కిందనే భావించాలేమో. రాజకీయాల్లో నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేయడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. బీజేపీ నమ్మకం పెట్టుకున్న ఆ హిందుత్వ ఓటు బ్యాంకు కూడా, బీజేపీని సమర్థించలేని పరిస్థితి వస్తోందిప్పుడు అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

Surgical strike on old Basti .. BJP's bloody 'Greater' thunder
Surgical strike on old Basti .. BJP’s bloody ‘Greater’ thunder

హైద్రాబాద్‌ని ఎలా ఉద్ధరిస్తారో చెప్పరేం.?

మేం అధికారంలోకి వస్తే, హైద్రాబాద్‌ని ఫలానా విధంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ చెబితే బావుంటుందేమో. అది మానేసి, కేవలం హిందూ – ముస్లిం వివాదం చుట్టూనే ప్రచారాన్ని పరిమితం చేస్తుండడంతో, తెలంగాణ రాష్ట్ర సమితికి లైన్‌ మరింత క్లియఱ్‌ అయ్యేలానే కనిపిస్తోంది.