ఇదేమీ హత్య కేసు కాదు.! పేపర్ లీక్ కేసు.! పరీక్ష అయ్యాక పేపర్ బయటకు వస్తే, అందులో వింతేముంది.? అంటూ న్యాయస్థానం అభిప్రాయపడిందట. గత రెండు మూడు రోజులుగా తెలంగాణలో నడిచిన హైడ్రామాకి తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ పర్యటనకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టెన్త్ ప్రశ్నా పత్రం లీక్ కేసులో అరెస్టవడం, ఏ1 నిందితుడు అవడం.. పెద్ద సంచలనం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పర్యటనలోపే బండి సంజయ్ జైలు నుంచి విడుదలవుతారంటూ బెట్టింగులు నడిచాయి.
కేసు విచారిస్తోన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు, అచ్చం పొలిటీషియన్‌లా మాట్లాడారన్న విమర్శలు సహజమే. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్‌కి బీజేపీ అధినాయకత్వం సంపూర్ణ భరోసా ఇచ్చిందట. ముందు ముందు మరింత ఉధృతంగా ముందుకు నడవాలని సూచించిందట. ఇంతకన్నా భిన్నంగా ఈ వ్యవహారంలో ఇంకేటోదో జరుగుతుందని ఎవరైనా ఊహించగలరా.? ఛాన్సే లేదు. మీడియా కక్కుర్తి హడావిడి తప్ప, ఈ కేసులో ఇంకేమీ జరగదుగాక జరగదు. అధికార పక్షం, విపక్షం కలిసి ఆడుతున్న డ్రామాగా కూడా దీన్ని చూడాలేమో.!
లేకపోతే, పేపర్ లీక్ కేసులో ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అరెస్టవడమేంటి.? అంతే మరి, అలాగే వుంటుంది మరి రాజకీయమంటే. డైవర్షన్ పాలిటిక్స్.. అవును, ముమ్మాటికి ఇది డైవర్షన్ రాజకీయమే. కవిత అరెస్టవుతారంటూ జరిగిన రాజకీయ రచ్చ, బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాజకీయ రచ్చ.. రెండిటికీ పెద్ద తేడాలేదు.! మధ్యలో జనమే వెర్రి వెంగళప్పలంతే.!