Birthday Wishes To Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు, లోకేశ్ బర్త్ డే విషెస్

భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్’  వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో, “హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్‌ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవలో మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

అలాగే, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కూడా కేంద్ర మంత్రికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “అమిత్‌ షా గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేశ పాలన, జాతీయ భద్రత పట్ల మీ అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. మీకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను” అని ఆయన తన ‘ఎక్స్’ సందేశంలో పేర్కొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Geetha Krishna Reveals Shocking Facts About Deepika Padukone | Sandeep Reddy Vanga | Telugu Rajyam