ఫాఫం అనుపమ.. ఆశలన్నీ అడియాసలయ్యాయే.!

బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది అనుపమ పరమేశ్వరన్. ఇంతలోనే పెద్ద షాక్ తగిలేసింది. ‘కార్తికేయ-2’ ఏదో లక్కీగా హిట్టయిపోతే, ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలో వేసుకోకూడదో తెలియక అయోమయంలో పడింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ.

అయితే, ‘18 పేజెస్’ సినిమా కూడా హిట్టవడంతో అనుపమలో కాన్ఫిడెన్స్ పెరిగింది. పైగా, ‘18 పేజెస్’ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు ఆమె వల్లనే సినిమా హిట్టయ్యిందనీ పొగిడారు. దాంతో ఒక్కసారిగా అనుపమ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

ఇంకేముంది, రెమ్యునరేషన్‌ని డబుల్ చేసేసిందట అనుపమ పరమేశ్వరన్. ‘ఇది పద్ధతి కాదు..’ అంటూ ఓ సీనియర్ నిర్మాత (అనుపమతో కలిసి పని చేసిన పెద్దాయనే) ఆమెకు తండ్రి తరహాలో సలహాతో కూడిన హెచ్చరిక చేశారట. కానీ, అనుపమ మాత్రం ‘తగ్గేదే లే..’ అనేసిందట.

ఇంతలోనే అనుపమకి పెద్ద షాక్ తగిలింది ‘బటర్‌ఫ్లై’ సినిమా రూపంలో. నిజానికి, ఆ సినిమాలో ఆమె బాగానే చేసింది. కానీ, కంటెంట్ లోపంతో తుస్సుమంది. పైగా, ఓటీటీ బొమ్మ. ఫాపం.. ‘బటర్‌ఫ్లై’ కొట్టిన దెబ్బతో ‘కార్తికేయ-2’, ‘18 పేజెస్’ సక్సెస్ కిక్కు కాస్తా మలయాళీ బ్యూటీకి దిగిపోయిందట.