మరీ అంతొద్దు అంటోన్న అనూ ఇమ్మాన్యుయేల్

అనూ ఇమ్మాన్యుయేల్‌ని స్టార్ హీరోయిన్ అనాలా.? ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్ అనాలా.? ఆమెకు మాత్రం అవకాశాలైతే వస్తున్నాయి. ఆమె గురించి దర్శక నిర్మాతలూ బాగానే చెబుతుంటారు. హీరోలు కూడా ఆమె గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు.

ఈ మధ్యనే ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమా చేసింది అనూ ఇమ్మాన్యుయేల్. ఓవర్ డోస్ హాట్ అప్పీల్ పండించేసింది. నిజానికి, అంత ఓవర్ డోస్ అవసరం లేదు ఆ సినిమాకి. కానీ, ఫుల్లుగా వాడేశారు.

ఆ తర్వాత అదే కోవలో మరికొన్ని సినిమాలూ అనూ ఇమ్మాన్యుయేల్‌కి టాలీవుడ్ నుంచి వచ్చాయట. ‘మరీ అంతొద్దు..’ అంటూ ఆయా సినిమాల్లోని హాట్ కంటెంట్‌పై అనూ ఇమ్మాన్యుయేల్ తేల్చి చెప్పిందట. దాంతో, ఓ యంగ్ హీరో నొచ్చుకున్నాడట.. కారణం, అది తన సినిమా కావడమే.

ప్రస్తుతానికైతే తమిళంలో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది అనూ ఇమ్మాన్యుయేల్. హాట్ అప్పీల్ విషయంలో అభ్యంతరాలేమీ లేకపోయినా.. మరీ టూమచ్ వల్గారిటీ అయితే వద్దనేది ఆమె పాలసీ అట. అయినా బోల్డంతమంది హీరోయిన్లుండగా, అనూ ఇమ్మాన్యుయేల్ మీదనే ఆ యంగ్ హీరో మనసు పారేసుకున్నాడెందుకో.?