రాష్ర్టంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్నది తెలిసిందే. 2019 ఎన్నికల్లో 23 సీట్లు గెలవడంతోనే టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లైంది. వైసీపీ వేవ్ ముందు టీడీపీ తునా తునకలైపోయింది. 2014 ఫలితాలు…2019 ఫలితాలు సరిచూసుకుంటే క్షేత్ర స్థాయిలో బలంగా ఉండే పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా మారిందేంటని సందేహం రాక మానదు? నాలుగు దశాబ్ధాల చంద్రబాబు రాజకీయ అనుభవం..మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఏమైపోయింది? అనే ముచ్చట తప్పదు. అయినా ఇదంతం గతం. ప్రస్తుతం చంద్రబాబు ముందున్న పెద్ద టార్గెట్ మళ్లీ పార్టీని బలోపేతం చేయడం. 2024 ఎన్నికలు వచ్చే లోపు పరిస్థితులన్నింటిని చక్కబెట్టి పార్టీని గాడిలోకి తీసుకురావాలి.
ఈ గ్యాప్ లో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుంటూ ముందుకెళ్లాలి. ఈ ఆర్డర్ లో ఎక్కడా తేడా జరిగినా టీడీపీ పరిస్థితే మారిపోతుంది. పార్టీని మళ్లీ క్షేత్ర స్థాయిలో బిల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ-ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనని ఆ రెండు ప్రాంతాల వాసులు స్వాగతించగా..చంద్రబాబు అండ్ కో వ్యతిరేకించి శత్రువులయ్యారు. ఆ ఏడు జిల్లాల నుంచి చంద్రబాబు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. సీమ జిల్లాల్లోనూ పరిస్థితి నానాటికి అంతకంతకు దారుణంగా మారిపోతుంది.
పార్టీని పట్టించుకునే నాయకుడు లేడు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారిపోతుంది. అటు వైసీపీలోకి వలసలు జోరుగా రహాస్యంగా సాగిపోతుంది. జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని…ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి చెప్పి మరీ చేస్తున్నాడు. దీంతో ఫలాలు అందని వారి ఇళ్ల లోగిళ్లలోకే చేరిపోతున్నాయి. జగన్ ప్రాబల్యం క్షేత్ర స్థాయిలో రోజు రోజు కి పెరుగుతోంది. ఇవన్నీ చంద్రబాబు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా బలహీన పరిచే అంశాలే. ఈ విషయాల్లో చంద్రబాబు సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ బలహీనంగా ఉన్న ప్రతీ జిల్లాపై, నియోజక వర్గాల వారీగా ప్రత్యేకంగా దృష్టిసారించి పనిచేయాలని భావిస్తున్నారుట. దీనిలో భాగంగా స్థానిక నేతల సేవల్ని విరివిగా వాడుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారుట. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాల్లో కూడా నియోజక వర్గాల్లో ఇంచార్జులు కనిపించడం లేదుట. ఒకవేళ ఉన్న ఎంత మాత్రం యాక్టివ్ గా ఉండటం లేదుట. హడావుడి చేసే నేతలు ఓవైపు ఉంటే! ఆ వర్గంలో వ్యతిరేక శ్రేణులు దీటుగానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంచార్జ్ గా పగ్గాలు ఇస్తామన్నా కొందరు ఆసక్తి చూపించడం లేదుట. చేస్తామని ముందుకొచ్చే వారికి అడ్డపుల్లలు అంతే వేగంగా పడుతున్నాయట. ఇలా రకరకాల సమస్యలు చంద్రబాబుని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్లే కనిపిస్తోంది.