ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరమైన సందడి మొదలైంది. ఒకపక్క అధికార బీఆరెస్స్ తనదైన దూకుడు ప్రదర్శిస్తుండగా.. మరోపక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలు, అనంతరం జరిగిన చేరికలతో కాంగ్రెస్ పార్టీ తనదైన దుకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతలు, మరి ముఖ్యంగా… మొన్న అమిత్ షా, నిన్న మోడీలు ఊహించని వరాలు ఇస్తూ సరికొత్త చర్చకు తెరతీస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ సంచలన ప్రకటనకు ప్రధాని మోడీ సంచలన ప్రకటనకు సిద్దమయ్యారు. ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో రంగంలోకి దిగిన బీజేపీ… సామాజిక సమీకరణాలో గేం తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది. దీనికి హైదరాబాద్ వేదిక కానుంది. బీఆరెస్స్ – కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా అడుగులు వేస్తుంది.
తెలంగాణలో అధికారంలోకి వస్తే… బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం.. మరో సంచలన నిర్ణయానికి సిద్దమైంది. శనివారం సికింద్రాబాద్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో “అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ”కు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ వేదికపై నుంచే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాన్ని మోడీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈ సమయంలో… ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చెబుతున్న ఎస్సీలలో చీలిక తీసుకొచ్చే అవకాశం ఉందని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది!
బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఎస్సీ రిజర్వ్ అయిన 19 స్థానాలతో పాటు జనరల్ అయిన నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ ఎస్సీ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇదే సమయంలో ఆ 22 స్థానాల్లోనూ 14 స్థానాలను మాదిగలకే ఇచ్చింది. ఇదే సమయంలో… బీసీ ఓటుబ్యాంకుపైనా ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ.. ఇందులో భాగంగా 36 స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టింది.
మరి బీజేపీ ఎంచుకున్న ఈ సామాజికవర్గ సమీకరణాలు తెలంగాణలో ఏ మేరకు వారికి ప్రయోజనం కలిగిస్తాయనేది వేచి చూడాలి!