ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 88,628 కోట్ల) భారీ పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించనున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కావడం గమనార్హం.
ఈ ఒప్పందంపై ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GDP)కి ఏటా రూ. 10,518 కోట్లు సమకూరుతుందని అంచనా. అంతేకాకుండా, సుమారు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖను ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో భారత్‌లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోయి, వైజాగ్ ఏఐ సిటీగా రూపుదిద్దుకోనుంది.

కీలక అంచనాలు: సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ. 88,628 కోట్లు), 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ (విశాఖపట్నం), 1,88,220 (ప్రత్యక్ష, పరోక్ష), ఏటా రూ. 10,518 కోట్లు (2028-2032 మధ్య)
ఈ డేటా సెంటర్ AI, క్లౌడ్ కంప్యూటింగ్, IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), 5G, ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లను వేగవంతం చేయనుంది. అంతేకాకుండా, విద్యుత్, ఫైబర్ ఆప్టిక్స్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాలకు ఊతం లభించి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆస్తి పన్ను, SGST రూపంలో రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరులు సమకూరనున్నాయి. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా యువతలో AI నైపుణ్యాభివృద్థికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది.
గతేడాది అక్టోబర్‌లో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలు ఈ ఒప్పందానికి దారితీశాయి.

