Election Commission: అడకత్తెరలో పోకచెక్క… ఇదే జరిగితే ఏపీలో మళ్లీ ఎన్నికలు!

Election Commission: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయంపై ఎందుకనో ప్రధాన మీడియా మౌనం వహిస్తున్నట్లుంది.. చూసీ చూడనట్లు వెళ్తున్నట్లుంది.. అది జరిగేది కాదులే అని భావిస్తున్నట్లుంది! కానీ.. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది! ఈ నేపథ్యంలో ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది నిజమా.. లేక, ఏపీలో ఎన్నికలు సజావుగా సాగింది నిజమా.. రెండింటిలో ఒకటే నిజమని చెప్పాల్సిన సమయం తెరపైకి వచ్చింది! దీంతో పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి తయారైంది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!

ఏపీలో గత ప్రభుత్వ హయాలో భారీ లిక్కర్ స్కామ్ నిజంగానే జరిగిందా..?

సీనియర్ పోలీసు అధికారులతో ఏర్పడిన ఈ సిట్ చెబుతున్నట్లు లిక్కర్ స్కామ్ విలువ రూ.3,500 కోట్లకు పైనే అనేది వాస్తవమేనా..?

పైగా… ఆ సొమ్మును వైసీపీ ఎన్నికల్లో ఉపయోగించిందనే ఆరోపణలు నిజమేనా..?

అదే నిజమైతే.. ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాయని, ఎలాంటి నిబంధనల అతిక్రమాలు సాగలేదని, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరమే లేదని ఈసీ చెప్పింది నిజం కాదా..?

ఇంతకూ ఏపీలో జరిగినట్లు చెబుతున్న లిక్కర్ స్కాం డబ్బులు జగన్ జనాలకు పంచింది నిజమా.. లేక, ఈసీ చెబుతున్నట్లు అలాంటిది ఏమీ లేదు ఎన్నికలు సజావుగా సాగాయి అని చెబుతున్నది నిజమా..?

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని.. దాని విలువ సుమారు రూ.3,500 కోట్లకు పైనే అని కథనాలు రావడం.. పలువురు కీలక నేతలు, అధికారులను సిట్ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ప్రైమరీ ఛార్జ్ షీట్ సిద్ధం చేసిన సిట్… ఈ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్మును 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ పేర్కొంది! ఇప్పుడు ఈ విషయమే అత్యంత కీలకంగా.. అడకత్తెరలో పోకచెక్క విషయంలో కీలకంగా మారబోతోందని అంటున్నారు.

ఈ క్రమంలో… గత ఎన్నికల్లో సుమారు 25 స్థానాల్లో పోటీ చేసిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు ఓ లేఖ రాశారు. ఇందులో భాగంగా.. ఏపీలో ఎన్నికలు ఎలాంటి ప్రలోభాలూ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగాయని, ఎలాంటి రీపోలింగ్ అవసరాలు లేకుండా ముగిసాయని ప్రకటించారు.. మరోవైపు.. ఏపీలోని సిట్ మాత్రం గత ఎన్నికల్లో రూ.3,500 కోట్ల పైన గత ఎన్నికల్లో పంచారని తేల్చిందని తెలిపారు.

అలాంటప్పుడు 2024లో ఏపీలో జరిగిన ఎన్నికలు సజావుగా, సక్రమంగా, రూల్స్ కు అనుగుణంగా జరిగినట్లు ఎలా అవుతుంది? పైగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులే ఈ విషయాన్ని తేల్చినప్పుడు.. ఆ ఎన్నికల్లో తమ ఓటమి కరెక్ట్ కాదు కదా అనేది ఆ పార్టీ అభ్యర్థుల ప్రశ్నగా ఉంది. అయితే దీనిపైనా ఎన్నికల కమిషన్ స్పందించలేదు! దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై తాజాగా జరిగిన విచారణలో… ఎలక్షన్ కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇందులో భాగంగా… ఆ అభ్యర్థులు రాసిన లేఖలు ఇప్పటివరకూ ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇదే సమయంలో.. దీనిపై ఏమి చేయబోతున్నారు అనే విషయాలను తెల్లియపరచాలని ఆదేశించింది. దీనికోసం వారం రోజుల సమయాన్ని ఇచ్చింది. దీంతో.. వ్యవహారం రసవత్తరంగా మారింది.

ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి….!

1. తాము ఫ్రీ అండ్ ఫెయిర్ గానే ఎన్నికలు నిర్వహించామని.. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు జరగలేదని.. డబ్బుల పంపకాలు జరగలేదని.. నాడు ఏపీలో జరిగినవి సరైన ఎన్నికలే అని ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు చెబుతుంది! ఇప్పటికే మీడియా ముందు ఒకసారి చెప్పింది!

2. ఎన్నికల కమిషన్ అలాగే హైకోర్టులో చెబితే… ఏపీలో గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది.. ఆ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారు అనే సిట్ వాదన అసత్యం అవుతుంది.. ఏపీలో లిక్కర్ స్కాం ఓ భోగస్ అనే విషయం తెరపైకి వచ్చే అవకాశం ఉంది!

3. ఈ విషయంలో కాదు కాదు కచ్చితంగా ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని.. అందులో సంపాదించిన సొమ్మునే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టారని సిట్ స్ట్రాంగ్ గా నిలబడితే… ఏపీలో ఎన్నికలు సజావుగా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఎలాంటి డబ్బు పంపకాలు జరగకుండ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందనేది అవాస్తవం అవుతుంది!

అంటే.. ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరిగాయని ఈసీ చెబితే.. లిక్కర్ స్కాం పై సిట్ చెప్పేది అసత్యం అవుతుంది… సిట్ చెప్పేదే అక్షరాలా నిజమైతే ఎన్నికల కమిషన్ చెప్పింది అసత్యం అవుతుంది! అప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది! ఏమి జరుగుతుందో వేచి చూడాలి! సత్యమేవ జయతే!!

బంగ్లా భారత్ యుద్ధం || Cine Critic Dasari Vignan EXPOSED Bangladesh Hindu Man Burnt Alive || TR