కొత్త వివాదం: ఈ గులాబీ ఎమ్మెల్యేకు అమ్మాయిల పిచ్చి!

ఈ మధ్య బీఆరెస్స్ ప్రజాప్రతినిధులపై “కోకల పిచ్చి” ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాజీవితంలో ఉండటం అంటే… వేరే అర్ధంతో ఆలోచిస్తున్నారో ఏమో కానీ… గత కొన్ని రోజులుగా గులాబీ ఎమెల్యేలపై ఈ తరహా ఆరోపణలు ఎక్కువ కావటం గమనార్హం. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ఈ తరహా ఆరోపణలతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు రావడమే కాదు.. ప్రజల్లో కూడా చులకన అయ్యే ప్రమాదం ఉంది.

వివరాల్లోకి వస్తే… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆరెస్స్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై.. ఆరిజన్ డెయిరీ సంస్థ సీఈవో బోడపాటి శైలజ సంచలన ఆరోపణలు చేశారు. ఇవి అలాంటి ఇలాంటి ఆరోపణలు కాదు. వాటిలో ఒకటి… “ఎమ్మెల్యేకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ” అని కాగా.. రెండోడి తమవద్ద డబ్బులు తీసుకున్నారని.. మరొకటి అక్రమకేసులు పెట్టి వేదిస్తున్నారని! ఇవి సరిపోవా… ఆ ఎమ్మెల్యే ఎలాంటివాడొ చెప్పడానికి.. ఆ ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోవడానికి.. ప్రతిపక్షాల చేతుల్లో అడ్డంగా దొరికిపోవడానికి.

ప్రస్తుతం దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలను కూడా మిడియాకు చూపిస్తున్నారు బోడపాటి శైలజ. అవును… “బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానంటూ ఎమ్మెల్యే తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని.. డెయిరీ సంస్థ విస్తరణ కోసం దుర్గం చిన్నయ్య చెప్పినట్లు విన్నానని.. హైదరాబాద్ కు వెళ్లిన ప్రతిసారీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు తాను ఎన్నో సపర్యలు చేశానని” శైలజ మీడియాకు తెలిపారు!

ఇక ఈ విషయాలు మరింత క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసిన ఆమె… “బిజినెస్ మీటింగ్ కోసం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తరుచుగా చిన్నయ్యను కలిసే వాళ్లం. ఈ క్రమంలో ఒకరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు నాతో పాటు మరో అమ్మాయి వచ్చింది. ఒక రోజు ఎమ్మెల్యే కాల్ చేసి మీతోపాటు వచ్చిన అమ్మాయిని రాత్రికి పంపుతారా? అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదని చెప్పాను. అప్పుడు.. ఏ అమ్మాయినైనా పంపాలని ఒత్తిడి చేశారు. తెలిసిన వారితో ఆయనకు ఓ బ్రోకర్ నంబర్ ఇచ్చి యువతులు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం.” అంటూ గులాభీ ఎమ్మెల్యేపై నేరుగా ఆరోపణలు చేస్తూ.. వాటికి సంబందించినవని చెబుతున్న కొన్ని కాల్ రికార్డులు కూడా వినిపిస్తున్నారు శైలజ.

ఇక మరో ఆరోపణగా… “మా దగ్గర డబ్బులు వాడుకొని, పర్సనల్‌ గా వాడుకొని.. బ్లాక్ మెయిల్ చేశాడు. ఓ రోజు మమ్మల్ని బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిచి.. తరువాత అక్కడున్న పోలీసులకు అప్పగించాడు. మూడు రోజులు పోలీసు స్టేషన్‌లో పెట్టించి మాపై ఏవేవో కేసులు పెట్టించారు. మాకే సంబంధం లేదని పోలీసులకు చెబితే.. ఎమ్మెల్యేతో మాట్లాడుకోండని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత రిమాండ్‌ కు పంపించారు. ఆ తర్వాత బయటకు వచ్చినతరాత మళ్లీ రెండు కేసులు పెట్టారు. తప్పుడు కేసులకు సంబంధించి మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. వీటిని చూపిస్తుంటే కూడా పోలీసులు.. మాకు ఇవన్నీ సంబంధం లేదు, ఎమ్మెల్యేతో మాట్లాడుకొండంటూ మాట్లాడుతున్నారు” అని చెబుతున్నారు శైలజ.

మరి ఈ వ్యవహారంపై అధికారపక్షం ఏమని స్పందిస్తుంది.. ఎలా రియాక్ట్ అవుతుంది.. ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది.. ఇంకెలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది వేచి చూడాలి!

MLA Durgam Chinnaiah sensational audio leak : నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు | RTV