Adani Meets Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. ఒకవైపు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు సంక్షేమ పథకాలపై వరాల జల్లు కురిపించారు.
పెట్టుబడులే లక్ష్యంగా అదానీతో భేటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ ఇప్పటికే చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతితో పాటు, రానున్న రోజుల్లో పెట్టబోయే భారీ పెట్టుబడులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ సమావేశం కీలకంగా మారనుంది.
దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం మరోవైపు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు ఏకంగా 7 వరాలను ఆయన ప్రకటించారు.
Vakiti Srihari Warns Pawan: పవన్.. తలతిక్క మాటలు మానుకో! – మంత్రి వాకిటి శ్రీహరి మాస్ వార్నింగ్
Komatireddy Venkat Reddy Warns: పవన్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్: క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం!
సీఎం ప్రకటించిన ప్రధాన అంశాలు:
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందిస్తున్నట్లుగానే, దివ్యాంగులకు కూడా ఆర్థిక సబ్సిడీ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయాలపై దివ్యాంగ సంఘాలు, ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

