భాజపా కి ఇంకా పరిపాలనా అనుభవం రాలేదా !!

BJP

భారతీయ జనతా పార్టీ (బిజెపి) లేదా దాని మిత్రపక్షాలు దేశంలోని  29 రాష్ట్రాలల్లో 18 రాష్ట్రా ప్రభుత్వాలకి నాయకత్వం వహిస్తుంది , ఈ రాష్ట్రల్లో జనాభా దేశ జనాభాలో దాదాపు 63%. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క బిజెపి పరిపాలిత రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే , ఇండియాస్పెండ్.ఆర్గ్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం లో భారతదేశం లో ఐదు ఉత్తమ పాలిత రాష్ట్రాల జాబితా లో చోటు సంపాందించింది.


బెంగళూరు ఆధారిత పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ (పిఎసి) అభివృద్ధి చేసిన పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ (పీఏఐ) 2018, 100 సూచికలను ఉపయోగించి రాష్ట్ర పరిపాలనను విశ్లేషించింది. వీటిలో లా అండ్  ఆర్డర్, ఆర్థిక స్వేచ్ఛ, పర్యావరణం, పారదర్శకత మరియు మొదలైనవి ఉన్నాయి.


కేరళ, తమిళనాడు, తెలంగాణ, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు  జాబితాలో మొదటి ఐదు రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటి లో కేరళను కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్, తమిళనాడును ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), తెలంగాణ ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మరియు కర్నాటక ను  జనతాదళ్ (సెక్యులర్) -కాంగ్రెస్ కూటమి పరిపాలిస్తున్నాయి .

అభివృద్ధి , పరిపాలన , పారదర్శకతను తమ ప్రధాన బలాలుగా చెప్పుకునే భాజపా కి ఇది ఒక విధంగా కనివిప్పు కలిగించే అధ్యయనం . ఇప్పటికైనా టీవీ చర్చల్లో , ప్రచార ఆర్బాటల్లో  కాకుండా భాజపా తన సామర్ధ్యాన్ని ప్రజలు కోసం వారికి కట్టబెట్టిన అధికారాన్ని ఉపయోగించాలి . ప్రతిపక్షాన్ని బలహీనం చేస్తే అది రాజకీయ విజయం అవుతుంది కానీ ప్రజలకి ఎలాంటి మేలు చెయ్యదు . కాబట్టి భాజపా ప్రతిపక్షాలు మీద దృష్టి తగ్గించి పరిపాలనపై శ్రద్ధ చూపించాలని ఆశిద్దాం .