ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

ఆంధ్ర లో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి

రాష్ట్ర ప్రభుత్వమే సరిగా పనిచేయడం లేదా? రాష్ట్రంలో న్యాయశాఖ సరిగా పనిచేయడం లేదా? న్యాయ సలహాదారులు సమర్ధవంతంగా పనిచేయడం లేదా? పాలక పక్షం కంటే ప్రతిపక్షం కోర్టుకు దగ్గరగా ఉంటోందా? లేక కోర్టు (judiciary) ప్రభుత్వం (legislature + executive)తో ఘర్షణ వైఖరి కోరుతోందా?

గడచిన 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టు తీవ్ర ఆక్షేపణలు, అభ్యంతరాలు తెలిపిన సందర్భాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన GO లను కోర్టు కొట్టివేసింది కూడా.

మొత్తానికి ఎందువల్లనో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ వైఖరి కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి ఈ ఘర్షణ ఆరోగ్యకరం కాదు.

ఇన్ని మొట్టికాయలు తినడం ప్రభుత్వ చేతకాని తనం అనుకోవచ్చు లేదా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని అనుకోవచ్చు. ఇవేవీ కాదంటే ప్రభుత్వంలోని న్యాయ విభాగం పూర్తిగా విఫలం అయిందని చెప్పవచ్చు. ఇంతకు మించిన కారణాలేవీ కనిపించడం లేదు.

ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే ఇప్పటికైనా అటువంటి నిర్ణయాలు విరమించుకోవాలి.

ప్రభుత్వ నిర్ణయాలను చట్టబద్ధంగా రూపొందించడంలో న్యాయశాఖ విఫలం అయితే సదరు శాఖ కాస్త మెరుగ్గా, మెలుకువగా, చట్టాలపై అవగాహనతో పనిచేయాలి.

ప్రభుత్వ న్యాయసలహా దారుల వైఫల్యం అయితే వారిని ప్రభుత్వం మార్చుకోవాలి లేదా వారు ఇప్పటికైనా చట్టాలు చదవడం మొదలుపెట్టాలి.

ఇవేవీ కారణాలు కాదంటే చేయగలిగిందేమీ లేదు. ఇలాగే మొట్టికాయలు తింటూ కాలం కలిసొచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

ప్రజా తీర్పు ఐదేళ్ళకోసారి మాత్రమే. కోర్టు తీర్పు ప్రతిరోజూ, ఐదేళ్ళపాటూ ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిందే.