ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో పై వైసీపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. వైసీపీ అధికారంలోకి రావడంతోనే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేస్తుంది. మరోవైపు విశాఖలో జరగుతున్న వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో విశాఖ వాసులు భయాందోళణకు గురవుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదం దేవ వ్యాప్తంగా కలకలం రేపగా, విశాఖ వాసులను షేక్ చేసింది. ఆ తర్వాత కూడా విశాఖలో మరో రెండు ప్రమాదలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాల్వెంట్స్ కంపెనీలో ట్యాంగ్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో విశాఖ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. దీంతో జగన్ సర్కార్ పై విమర్శలు కూడా మొదలయ్యాయి.
నీ నేపధ్యంలో విశాఖలో మరోసారి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, చర్యలు తీసుకునేందుకు వైసీపీ ప్లాన్ వేసిందని సమాచారం. ఈ క్రమంలో అన్నీ కెమికల్ ఇండస్ట్రీలలో ప్రమాదాలు అరికట్టేందుకు ఒక నివేదికను సిద్ధం చేయాలని, అలాగే ఇతర దేశాలలో ఆచరిస్తున్న భద్రత ప్రమాణాలతో కూడిన నివేదికను ఇటీవల సీయం జగన్ ప్రత్యేకంగా తెప్పించుకునట్లు తెలుస్తోంది. నిపుణులతో కలిసి ఆ నివేదికలు అన్నీ స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది.
అనంతరం, ఫైల్ రూపంలో కార్యరూపం దాల్చిన వెంటనే, ఆ ఫైల్ మీద జగన్ సంతకం పెడితే, విశాఖలో పెద్ద టీమ్ ఎంటర్ కానుందని, దీంతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా, నగరంలో ఉన్న అన్ని కంపెనీలకు ఆ టీమ్ సూచనలు ఇచ్చి ప్రమాదాలు అరికట్టే విధంగా మొత్తం ప్లాన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. మరి ఇప్పటికే వరుస ప్రమాదాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్న నేపధ్యంలో వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.