ఇపుడు కొత్తగా ఇదేం రోగం ఈ సన్నాసులకి

(గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి*)

రామాయణ విషవృక్షం..ఒకప్పుడు 3 భాగాలు..ఇప్పుడంతా కలిపి ఒకటే పుస్తకం…కవర్ పేజీ మీద వనవాసంలో అవసరమైన సామాగ్రి మూటకట్టుకుని నడుస్తున్న లక్ష్మణుడు..ఇక నోట్లో చుట్ట,బీడీలు కాలుస్తూ గుహుడు,హనుమంతుడు కనిపిస్తారు.ఈ పుస్తకం చదివి విమర్శలను తిప్పికొట్టినవాళ్లు ,నవ్వుకుని యధాప్రకారం పూజాపునస్కారాలు చేసుకున్నవాళ్లు,తాకడానికే భయపడ్డవాళ్లున్నారు..ఇలాంటి అభిప్రాయమే రచయిత్రి రంగనాయకమ్మా చెప్పారు..

ఇదంతా 40 ఏళ్ల క్రితం కథ…ఎవరూ రంగనాయకమ్మ ఇంటి మీద రాళ్లైతే వెయ్యలేదు..ఇటీవల ఇదండీ భారతం సంగతీ అంతే…మతగ్రంధం మీద సద్విమర్శో,కువిమర్శో సహించిన ఉదార హృదయం హిందువులది,ఇతరులకా విశాల హృదయం లేదని కొందరి భావన…
కెరీర్ వెనకాల పరుగులు..అంతంత పెద్ద పుస్తకాలు చదివే ఓపిక లేదు…ఇన్‌స్టంట్ ఫుడ్ లాగా అంతా ఇన్‌స్టంట్ సమాచారం కావాలి.


సోవియట్ యూనియన్ కూలడమో,గ్లోబలైజేషన్ ప్రభావమో…మనిషి కాస్త వినియోగదారుడైనందుకో..అంతులేని సంపద,దాని వెనకాల పరుగు…రిలాక్స్ అవ్వడానికి మళ్లీ మతాన్నే శరణుజొచ్చారు…ప్రసారమాధ్యమాల్లో అన్ని మతాల చానెల్స్,ఆధ్యాత్మిక ప్రవచనాలు..ఉన్నకథలు,లేనివి కలిపికొట్టెయ్యడమే….శ్రోతలు/ప్రేక్షకులు మళ్లీ పోలోమంటూ ప్రార్ధనా స్థలాలకు పరుగు…జీవితంలో పెళ్లి క్రతువు ఒక్కటే చూసుకునే జనాలూ నానా ఫంక్షన్స్ చేసుకోవడం..దీని మూలాలు ఎక్కడో వెదుక్కోవడం…సంపాదన ప్రదర్శనకు ఇవీ ఓ మార్గం…
జనాల ఈ గోలకు తోడు రాజకీయ పార్టీలు…మతం,కులాలు ప్రచారాయుధాలయ్యాయి…జనం బుర్రలో అన్నిమతాల ప్రవచనకారులతో పాటూ నాయకులూ మత విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉనారు.


మతసంబంధమైన ఏ విమర్శనూ..ఏ రకందైనా..స్వీకరించే సహనం జనానికి లేదు…ఈ సున్నితత్వాన్ని మరచిపోయి..
ఎవడో తలమాసిన వెధవో రావడం ఒక కూత కూయడం…అంతే మాటపడ్డమతం వాళ్లు ఆ మతంలో వాడి అమ్మ రంకుకు వాడు పుట్టలేదా?ఈ మతంలో పసిపిల్లతో రాక్షసరతి చెయ్యలేదా? అంటూ బండబూతులు.


ఈ చిచ్చు రగిల్చే తలమాసిన వె…వలకు పనీపాట ఉందదు,ఏ పని చేస్తారో తెలియదు,పెళ్లాంపిల్లలను ఏ పని చేసి పోషిస్తుంటారో తెలియదు…వీళ్లకు అడ్డదారులు తొక్కైనా సరే సెలబ్రిటీ స్టేటస్ రావాలి..ఈ దరిద్రచెత్త ప్రసారం చేసే ఎలక్ట్రానిక్ మీడియా టీఆర్పీ రేట్లు పెరిగి సంపాదించుకుంటున్నాయి.


దేశాన్ని అస్థిరపరచడానికి వీళ్లకు విదేశీ నిధులొస్తాయని కొందరంటారు..మరికొందరు అసలు ఈ టీవీలోళ్ళే వీళ్లకు నెల జీతాలిస్తున్నారని కొందరంటారు.

కానీ నేను మాత్రం..
ఈ సన్నాసులకు మతరాజకీయాలు నడిపే పార్టీలు కుక్క బిస్కెట్లు వేస్తున్నారని.
ఈ ఇన్‌స్టంట్ ఫుద్,నాలెడ్జ్ పిల్లలు ఇవి చదివి ఆవేశాలు తెచ్చుకుని త్వరగా పోలరైజ్ అయి ఓట్లు వెయ్యడానికి ఈ గజ్జికుక్కలకు బిస్కెట్లు వేస్తున్నారని నమ్ముతున్నా…

ఇక సమాజాన్ని నిలువునా చీలుస్తున్న ఈ గజ్జికుక్కలను సమర్ధిస్తూ గో..ప్ప మేధావులు బయలుదేరారు…ఈ మేధావుల కొంపల్లో చేసుకునే వ్రతాలు,ప్రార్ధనలూ మరెక్కడా జరగవు..వీళ్లు చెయ్యరులెండి..వీళ్ల వృద్ధి కాంక్షిస్తూ కొంపలో మేడం గార్లు చేస్తుంటారు. ( ఫేస్ బుక్  నుంచి)

(*రచయిత తెలుగునాట పేరున్న సామాజిక సాంస్కృతిక విశ్లేషకుడు)