భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి.. ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసా..?

మన హిందు సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ప్రజలు ఇప్పటికీ వాస్తు శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అందువల్ల ఇప్పటికీ వాస్తవ నియమాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో ఆహార నియమాలు కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలకు విరుద్ధంగా ఉంటే మీ ఆహారం ప్రతికూల శక్తుల కు సమానమని గ్రంధాలలో తెలుపబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేయడానికి సరైన దిశ ఏంటి, ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసే సమయంలో కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో మనం భోజనం చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుంటాము.. అనేది కూడా చాలా ముఖ్యం. భోజనం చేయటానికి ముందు చేతులు కాళ్లు కడుక్కున్న తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవాలి. అంటే మనం భోజనం చేసేటప్పుడు తూర్పు, ఉత్తర దిక్కులు చూస్తూ భోజనం చేయాలి అని అర్థం. పొరపాటున కూడా దక్షిణ, పడమర ముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు. ఎందుకంటే వామన పురాణం ప్రకారం దక్షణ ముఖంగా కూర్చోని భోజనం చేయటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

అంతే కాకుండా ఇలా చేయడం వల్ల రాక్షస ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అలాగే పడమర ముఖంగా కూర్చొని భోజనం చేయరాదు .ఎందుకంటే పడమర ముఖంగా కూర్చొని ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాదరక్షకాలతో దక్షిణ వైపు కూర్చొని భోజనం చేసే వ్యక్తి తన ఆహారాన్ని భూతంగా పరిగణించాలి. అలాగే భోజనం చేసేటప్పుడు తలపై ఎలాంటి వస్త్రం ధరించకూడదు. అలాగే చెప్పులు వేసుకుని భోజనం చేయకూడదు. అలాగే తూర్పు, ఉత్తరం వైపున ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మనిషికి గొప్ప ఐశ్వర్యం, ఆయుష్షు లభిస్తుందని పద్మ పురాణంలో వివరించబడింది.