మామూలుగా చాలా మంది వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఇంటి ప్రధాన ముఖ ద్వారం నుంచి బాత్రూం అలాగే ఇంట్లో పడకగది వంటగది ఇలా ప్రతి ఒక్క విషయంలో వాస్తు నియమాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో ఈ వస్తువులు ఏవైనా తప్పు దిశలో ఉంటే అది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇది ఆ ఇంట్లో నివసించే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడా ఒకటి.
మాములుగా మనం బాత్రూమ్‌ని ఉపయోగించిన తర్వాత దానిని తడిగా ఉంచే అలవాటు ఉంటే, ఇది వాస్తు దోషానికి దారి తీస్తుంది. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చు. వాస్తు దోషాన్ని తగ్గించడానికి, బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత పూర్తిగా పొడిగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం రాదు. అలాగే మీ ఇంట్లో స్థలాన్ని ఆదా చేయడానికి మీరు బాత్రూమ్ , టాయిలెట్‌ను ఒకే చోట నిర్మించినట్లయితే, ఇది వాస్తు దోషానికి కూడా దారి తీస్తుంది.
ఇది మీ జీవితంలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఒకే స్థలంలో బాత్రూమ్ , టాయిలెట్ చేయవలసి వస్తే, మీరు రెండింటికి మధ్య పరదా వేయాలి. బాత్‌రూమ్‌లో పటిక ఉంచాలి. ఈ చిట్కాలు బాత్రూమ్‌కు సంబంధించిన వాస్తు దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. దీనితో పాటు, ఈ లోపాల ప్రభావాన్ని తగ్గించడానికి బాత్రూంలో పటికను ఉంచండి. పటికను ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ కష్టాలు దూరం అవడంతో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.