సాధారణంగా మన హిందువులు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచార వ్యవహారాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కటి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరగాలని అనుకుంటారు ముఖ్యంగా శుక్రవారం ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు శుక్రవారం మహాలక్ష్మికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడమే కాకుండా ఈ శుక్రవారం రోజున కొన్ని నియమ నిబంధనలను కూడా పాటిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే శుక్రవారం రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు కూడా తెలియజేస్తుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అంటే శుక్రవారం కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.మరి శుక్రవారం ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే…
శుక్రవారం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి అయితే మన ఇంట్లో ఏదైనా పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాలు కనుక ఉంటే వాటిని శుక్రవారం పొరపాటున కూడా నిమర్జనం చేయకూడదు. అలాగే శుక్రవారం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారాలను ఎప్పుడూ కూడా మూసి వేయకూడదు. సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారాలను తెరిచే ఉండాలి.అదేవిధంగా మహిళలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందుకే శుక్రవారం ఇతర మహిళలను ఎప్పుడు కూడా కించపరుస్తూ మాట్లాడుకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసన్నం కోసం ఉపవాసం చేసే మహిళల పట్ల దురుసుగా మాట్లాడకూడదు.