శని కాలసర్ప దోష నివారణ కోసం శివరాత్రి రోజున ఈ పరిహారాలు పాటించాలి..?

మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని ప్రజల నమ్మకం. అంతేకాకుండా తెల్లవారులు జాగరణ చేసే శివారాధన చేయటం వల్ల కూడా శివుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి తో పాటు శని ప్రదోషం, వాశి యోగం, సన్ఫ యోగం, శంఖ యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి వస్తున్నాయి. ఈ శుభ యోగాలలో చేసే పూజలు,పరిహారాలు వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శని కాలసర్ప దోష నివారణ కోసం పరిహారాలు చేయటం వల్ల కూడా వాటి నుండి విముక్తి పొందవచ్చు. అయితే శని కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి మహా శివరాత్రి రోజున ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకంలో శని దోషం ఉంటే దోష నివారణ కోసం మహాశివరాత్రి రోజున శివయ్యని పూజించడం వల్ల సమస్యలు దూరమైపోతాయి. మహాశివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు సమర్పించి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తికి శని దోషం వల్ల కలిగే దుష్ప్రభావాలు దూరం అవుతాయని పండితులు సూచిస్తున్నారు.

మహాశివరాత్రి రోజు శనికి సంబంధించిన దోషం తొలగించడానికి శివునికి రుద్రాభిషేకం చేయాలి. ఒకవేళ రుద్రాభిషేకం చేయటానికి వీలు లేనివారు రుద్రాక్ష జపమాలతో శివ సహస్రనామం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జాతకం ప్రకారం కాలసర్పదోషం ఉన్న వారి జీవితంలో తరచూ కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. జాతకంలో ఉన్న కాలసర్ప దోషాన్ని తొలగించడానికి మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించి జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేయటం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. అలాగే మహాశివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం వల్ల ఆ శివుడి అనుగ్రహం లభించి జీవితంలో ఎదురయ్యే కష్టాలు అన్ని తొలగిపోతాయి.