మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేయడమే కాకుండా దేవాలయాలకు వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటారు. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల ఆ పొరపాట్లకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా చేసే పొరపాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• సాధారణంగా గుడికి వెళ్లే ముందు తల స్నానం చేసి గుడికి వెళ్తారు. అయితే గుడికి వెళ్లే తొందరలో చాలామంది స్త్రీలు జుట్టుని ముడి వేసుకోకుండా అలాగే వదులుకొని వెళ్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని తిరగరాదు. ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని వెళ్లాలి. అలాగే
• సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మనం గుడి బయట చెప్పులు వదిలి గుడి లోపలికి వెళ్తాము. స్నానం చేసిన తర్వాత చెప్పులు వేసుకుని గుడికి వెళ్లి అక్కడ కాళ్లు కడుక్కోకుండా గుడి లోపలికి పొరపాటున కూడా వెళ్ళరాదు. స్నానం చేసి చెప్పులు వేసుకోవడం వల్ల మనం మైలపడినట్టు లెక్క. అందువల్ల గుడి బయట చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కున్న తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలి.
• అలాగే ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పొరపాటున కూడా నమస్కారం చేయరాదు. ఎందుకంటే ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మొదటి నమస్కారం దేవుడికి మాత్రమే చేయాలి.
• అలాగే దేవుడి దర్శనానికి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనం తెచ్చిన పూజా సామాగ్రి దేవుడికి సమర్పించి ఎదురు దేవుడికి ఎదురుగా కాకుండా ఒక వైపుగా నిలబడి నమస్కారం చేసుకోవాలి. దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకోవడం వల్ల ఆ పూజాఫలం మనకు దక్కదు.
• అలాగే ఎట్టి పరిస్థితులోనూ ఆలయంలో గోళ్లు కొరక రాదు. మన గోళ్లు, జుట్టు ఆలయ పరిసరాలలో పడితే మనకు సకల పాపాలు చుట్టుకుంటాయి.