తిరుమల అధిక ఆశీయుజమాసంలో జరగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలలో నాల్గో రోజు మంగళవారం నాడు జరిగే సేవల విశేషాలు ఇవే..
నాల్గో రోజు ఉదయం స్వామి వారు కల్పవృక్ష వాహనం మీద ఊరేగుతారు. అనంతరం రాత్రి వేళలో సర్వభూపాల వాహనాలలో అమ్మవార్లతో కలసి శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. కొవిడ్ సందర్భంగా స్వామివారి సేవలు ఏకాంతంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయ చరిత్రలో భక్తులు లేకుండా ఏకాంతంగా స్వామి వారి సేవలు జరగడం ఇదే తొలిసారి