సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

sri lakshmi stotram by sarvadeva

శుక్రవారం.. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు అమ్మవారిని ఆయా స్తోత్రాలతో ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి. అటువంటి పవర్పుల్ స్తోత్రంలలో సర్వదేవకృత శ్రీలక్ష్మీ స్తోత్రం ఒకటి.ఆ శ్లోకాన్ని ఎవరైతే శుక్రవారం పారంభించి భక్తితో చదువుతారో వారికి అనేక శుభాలు కలుగుతాయి.

Sri Lakshmi Stotram by Sarvadeva
Sri Lakshmi Stotram by Sarvadeva

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే‖

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః‖

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే‖

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః‖

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే‖

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే‖

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే‖

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః‖

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్‖

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్‖

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్‖

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్‖

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్‖
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్‖

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్‖

‖ ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ‖
ఈ స్తోత్రం ఉదయాన్నే లేచి శుచితో శుభ్రతతో పారాయణం చేస్తే అన్ని లభిస్తాయి.