Vinayaka Chaturthi Katha : వినాయకుడు ఏకదంతుడిలా ఎలా అయ్యాడు ?

Vinayaka Chaturthi Katha

 వినాయకుడు అనగానే మనకు గుర్తుకువచ్చే స్వరూపం ఏకదంత స్వరూపం. ఒక దంతంతో స్వామి రూపం కన్పిస్తుంది. అసలు స్వామికి రెండు దంతాలు ఉండాలి మరి ఒకటే ఎందుకు ఉంది. దాని వెనుక కథ తెలుసుకుందాం..

Vinayaka Chaturthi Katha
Vinayaka Chaturthi Katha

– పూర్వం పరుశరాముడు కార్తవీర్యుని వధించిన అనంతరం తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురామున్ని పైకిఎత్తి పడవేశాడు.

– పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆకథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ‘ఏకదంతుడి’ గా పేరు పొందాడు.