సనాతన ధర్మంలో అనేక పరిహారాలు. అల్పులను దృష్టిలో పెట్టుకుని మహార్షులు అనేక సూక్ష్మ, సులభ ఉపాయాలను మానవాళికి అందించారు. అలాంటి వాటిలో అగస్త మహాముని ఇచ్చిన అమ్మవారి 16 శక్తివేల్ నామాలను ఇప్పుడు తెలుసుకుందాం…
‘‘ ప్రథమో జ్ఞానశక్త్యాత్మా- ద్వితీయః స్కంద ఏవచ!
అగ్నిగర్భః తృతీయస్తు – బాహులేయః చతుర్థకః!!
గాంగేయః పంచమః ప్రోక్తః – షష్ఠః శరవణోద్భవః!
సప్తమః కార్తికేయశ్చ – కుమారశ్చాష్టమస్తదా!!
నవమః షణ్ముఖః ప్రోక్తః – తారకారి స్మృతో దశః!
ఏకాదశశ్చ సేనానీః – గుహో ద్వాదశ ఏవచ!!
త్రయోదశో బ్రహ్మచారీ – శివతేజశ్చతుర్దశః!
క్రౌంచధారీ పంచదశః – షోడశః శిఖివాహనః!! ’’
ఈ పదహారు నామాలు మహా మంత్రం. వీటిని నిత్యం ఎవరైతే చదువుతారో వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ 16 నామ మంత్రములను నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.