తమలపాకులపై దీపం పెడితే ముగురమ్మల అనుగ్రహం !

Lamp On A Betel leaf

విశ్వంలో ఏదైనా ముగురమ్మల శక్తి స్వరూపమే. ఆ అమ్మల అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. క్రియా, ఇచ్ఛా, జ్ఞాన శక్తి స్వరూపం ఆ అమ్మలు. వారే కాళీ, లక్ష్మీ, సరస్వతి. అయితే వీరి అనుగ్రహానికి శాస్త్రాలలో అనేక సులభ అనుగ్రహ పద్ధతులు తెలిపారు. వాటిలో ఒకటి తెలుసుకుందాం…

Lamp On A Betel leaf
Lamp On A Betel leaf

తమలపాకులపై దీపాన్నివెలిగించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి. తమలపాకు కాడలో పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే… తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా వుండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి ఫింఛం వలె పూజగదికి ముందున్న సిద్ధం చేసుకోవాలి.

దానిపై మట్టి ప్రమిదను వుంచి.. తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో వున్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషాలు చేకూరుతాయి. ముగురమ్మల అనుగ్రహం కూడా శ్రీఘ్రంగా లభించే ఉత్తమ పరిహారంగా పెద్దలు పేర్కొంటున్నారు. మీరు భక్తితో ఆచరించి ఫలితాన్ని పొందండి.