Komuravelli Mallanna: తాత్కాలికంగా నిలిపివేసిన కొమురవెల్లి మల్లన్న దర్శనం

Komuravelli Mallanna: తెలంగాణలోని సిద్ధిపేటలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా విలసిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున (మల్లన్న) స్వామి మూల విరాట్టు దర్శనాన్ని ఈ నెల 19 నుండి 25 వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 26న మల్లన్న స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా మూలవిరాట్లకు రంగులు వేసి అలంకరణ చెయ్యాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో దర్శనాలని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుండి పునర్దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, భక్తులకి ఈ తేదీల్లో ఉత్సవ విగ్రహాల దర్శనం ఉంటుందని వెల్లడించారు.మల్లన్న స్వామి వారు కొమురవెల్లిలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లుగా శిలాశానాలద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు స్వామివారు ఓ గొర్రెల కాపరికి కలలో ప్రత్యక్షమయ్యి తాను ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిశానని చెప్పినట్టుగా భక్తుల విశ్వాసం. 500 ఏండ్ల కిందట పుట్ట మన్నుతో తయారు చేసిన స్వామివారి విగ్రహం ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. మల్లన్న దర్శనంకోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.