మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో కొన్ని నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఏడాది పాటు ఆ మహావిష్ణువును పూజించిన పూజ ఫలితం దక్కుతుంది. మార్గశిర మాసంలో తులసీదళాలు మాలగా కట్టి విష్ణుమూర్తికి సమర్పించి పూజించాలి. ఇలా తులసీదళాలతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది. అంతే కాకుండా స్వామికి సమర్పించే ప్రతి తులసి ఆకుకి ప్రతి అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున విష్ణువు ఎదుట నెయ్యి దీపం వెలిగించి పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా మోక్షం లభిస్తుంది.
మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి విష్ణు దేవాలయంలోకి వెళ్లి ఆ మహా విష్ణువు ని దర్శించుకోవడం వల్ల దోషాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది . అందువల్ల ఎంతో విశిష్టమైన వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దేవుని దర్శించుకోవడానికి ప్రజలు వేల సంఖ్యలో ఆలయానికి వెళుతూ ఉంటాడు. ఇక ఈ మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువుతోపాటు వరాహి దేవిని పూజించటం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది.
పవిత్రమైన మార్గశిర పంచమి రోజున వరాహి దేవిని నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆ దేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా వరాహి దేవిని పూజించటం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా మార్గశిర పంచమి రోజున వరాహి దేవికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర పంచమి రోజున వారాహి దేవి ఎదుట పంచముఖ దీపాన్ని నేతి తో వెలిగించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. పంచమి రోజున సాయంత్రం ఇలా చేస్తే సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.