శబరిమల శ్రీఅయ్యప్పస్వామి దగ్గరకు ఏటా లక్షలాదిమంది భక్తులు వెళ్తుంటారు. స్వామికి ఇడుముడి, నక్షత్రదర్శనం చేసుకోవడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే ఈఏడాది కొవిడ్‌తో భక్తులు కఠిన నిబంధనల మధ్య అక్కడకు వెళ్లలేకపోతున్నారు. దీంతో స్వామి ప్రసాదం అయినా లభిస్తే బాగుండునని భావిస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖ భక్తుల కోసం ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటికి చేర్చే ప్రక్రియను చేపడుతుంది. ఆ వివరాలు.. శబరిమలైలో అయ్యప్ప స్వామి ప్రసాదం అవరనం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఈ క్రమంలోనే పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుని భక్తులకు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని పోస్టు ద్వారా గత కొన్ని రోజుల నుంచి డోర్ డెలివరీ చేస్తుంది. దీని కోసం దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి స్వామి ప్రసాదం పేరుతో 450 రూపాయలు చెల్లించాలి.. దీనికోసం పూర్తి పేరు పూర్తి అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక రిజిస్టర్ చేసుకున్నవారికి స్వామివారి ప్రసాదం తోపాటు అభిషేక నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, డోర్ డెలివరీ అవుతాయి. భక్తులు స్వామి ప్రసాదం కోసం జనవరి 15లోపు మాత్రమే ఈ పనిచేయాలి. కాబట్టి జనవరి 15లో బుక్ చేసుకున్నవారకి మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.