తామర పువ్వులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా తామర పువ్వులను లక్ష్మీ పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొలనులో విరబూసే ఈ తామర పువ్వులు దేవుళ్లకు సమర్పించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం పొందవచ్చు. తామర పువ్వులను పూజలో మాత్రమే కాకుండా అందం, ఆరోగ్య సమస్యలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తామర పువ్వు తో కొన్ని రకాల పరిహారాలు పాటించటం వల్ల మన సమస్యలు అన్ని దూరం అవుతాయని పండితులు సూచిస్తున్నారు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయటానికి తామర పువ్వులతో ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంతానం : ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లల్ని కనటానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే సంతానం లేనివారు ఇలా లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేయకుండా తామర పువ్వులతో ఈ పరిహారం చేస్తే సంతానం పొందవచ్చు. సంతానం లేని వారు ఏకాదశి రోజున కృష్ణుడికి 2 తామరపూలను సమర్పించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సంపద పెరగాలంటే : లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది. 11 వారాలు పాటు ఇలా చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
వైవాహిక జీవితంలో సమస్యలు : భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు జరుగుతుంటే బుధవారం నాడు తామరపువ్వుకు చందనాన్ని పూసి లక్ష్మీ గణపతికి సమర్పించాలి. ఇలా 11 వారాలపాటు తామర పువ్వులు సమర్పించి పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్తలు దూరమై సంతోషంగా జీవిస్తారు.