లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేయాలి..?

పురాతన కాలం నుండి మనదేశంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఎంత కష్టపడి పని చేసే డబ్బు సంపాదించినా కూడా ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. అంతే కాకుండా మన జాతకంలో కానీ, ఇంట్లో కానీ దోషాలు ఉండటం వల్ల కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు తరచూ తలెత్తుతూ ఉంటాయి. అయితే ఈ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.

లక్ష్మీదేవి కటాక్షం పొంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందువల్ల శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. లక్ష్మి దేవికి “ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్య లక్ష్మి, వరలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి” అని ఎనిమిది రూపాలు ఉంటాయి. . శుక్రవారం రోజున అమ్మవారి ఎనిమిది రూపాలను లక్ష్మీదేవి మంత్రాలను పటిస్తూ పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

అయితే లక్ష్మీదేవిని పూజించటానికి శుక్రవారం రోజున ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రవారం రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆ తర్వాత అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి అష్టగంధంతో అమ్మవారికి తిలకం దిద్దాలి. ఆ తర్వాత ఓం ఐం హ్రీం శ్రీ అష్ట లక్ష్మీయై హ్రీం సిద్థయే మామ్ గృహె అగ్చ్ఛగాచ నమః స్వాహా అనే మంత్రంతో పాటు అష్ట లక్ష్ములకు సంబంధించిన మంత్రాలను చదువుతూ ఇంట్లోనే ఎనిమిదిక్కుల్లో 8 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు దూరం కావడమే కాకుండా ధన, ధాన్యం ప్రాప్తిస్తుంది.