ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తినమని చెబుతారు ఎందుకో తెలుసా?

సాధారణంగా హిందువులు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతారు. ఈ విధంగా చాలామంది వారు చేసే ప్రతి పనిని కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చేయడమే కాకుండా వారి నడవడిక కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు.ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ వాస్తును చూసి వాస్తుకు అనుకున్నంగా చేయటం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని చాలామంది భావిస్తూ ఉంటారు.ఇలా వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసించేవారు వారు ఇంటి నుంచి ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పెరుగు తిని వెళ్తారు.

ఈ విధంగా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు పెరుగు తినడానికి గల కారణం ఏంటి పెరుగు తినడం వల్ల ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం లేదా ఉద్యోగం కోసం పరీక్షల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో కాస్త పంచదార కలిపిన పెరుగు తినాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా పంచదార కలిపిన పెరుగు తినడం వల్ల మనపై ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఒక పని నిమిత్తం బయటకు వెళ్లేవారు పెరుగు తినడం వల్ల వారిపై ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా పూర్తిగా వారికి పాజిటివ్ ఎనర్జీ కలిగించి మనం వెళ్లే పని ఎంతో విజయవంతంగా పూర్తి అవుతుందని విశ్వసిస్తారు. అందుకే పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెరుగు తీసుకోవాలని పండితులు చెబుతుంటారు.ఇక దూర ప్రయాణాలు చేసే వారు కూడా ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం కాస్త పెరుగు తిని బయలుదేరుతుంటారు.