చనిపోయిన వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా రాత్రివేళ పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో గతంలో జరిగిన సంఘటనలు కలలు రూపంలో వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరికొన్ని సందర్భాలలో మన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా మన కలలో కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమందికే అప్పుడప్పుడు పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా ఒక్కో విధమైన కల రావటానికి వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం నిద్రపోయిన తర్వాత కలలో మన కుటుంబ సభ్యులు స్నేహితులు కనిపిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలలో మరణించిన వారు కూడా కనిపిస్తూ ఉంటారు.

కలలో మరణించిన వారు తిరిగి బ్రతికి వచ్చినట్లు లేదా వారు ఏదైనా కోరికల కోరినట్లు కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఎలా మరణించిన వారు కలలో కనిపించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణించిన కుటుంబ సభ్యులు స్నేహితులు మన కలలో కనిపించినప్పుడు రామాయణం భగవద్గీతను చదవటం శుభప్రదం. కొన్ని సందర్భాలలో చనిపోయిన వారు ఆకలితో బాధపడుతున్నట్లు కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఆకలితో ఉన్న ఎవరికైనా అన్న దానం చేయాలని అర్థం.

అలాగే కొన్ని సందర్భాలలో మరణించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా కోపంగా ఉన్నట్లు కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఏదో పెద్ద తప్పు చేసినట్లు గ్రహించాలి. వెంటనే మనం చేసిన తప్పు ని సరిదిద్దుకోవాలి. మన పూర్వీకులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కలలో ఏమీ మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్లు మనకు సంకేతం ఇస్తున్నట్లు అర్థం. ఇలా చనిపోయిన మన పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలలో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది.