మన భారతీయ సంస్కృతిలో దేవతారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలకు వెళ్లి కూడా దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలా మనకి తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇలాంటి పొరపాట్లు మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ముందే సూచిస్తాయి. పూజ చేసే సమయంలో ఏ వస్తువులు కిందపడితే ఆ శుభంగా భావిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోయి కిందకు పడుతుంది. ఇలా కుంకుమజారి కింద పడటం అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే భర్తకు ఏదైనా సమస్యలు రావడం అపాయం వాటిల్లటానికి సూచనగా భావిస్తారు. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడ్వకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలపాలి.
ఇక అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున చేయి తగిలి కింద పడుతూ ఉంటుంది. ఇలా జరగటం కూడా అశుభంగా భావిస్తారు. పొరపాటున చెయ్యి తగిలి దీపం కింద పడటం అనేది కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని తెలిపే సూచన. ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి దీపాన్ని దేవుడు ముందు వెలిగించాలి.
అంతేకాకుండా కొన్ని సందర్భాలలో దేవుడికి నైవేద్యంగా పెట్టవలసిన ప్రసాదం కూడా చేయి జారీ కిందపడుతుంది. ఇలా దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం నేలపాలు అవ్వటం కూడా ఆశుభం. ఇలా జరిగినప్పుడు ఆ ప్రసాదాన్ని కొంచెం నుదుటికి రాసుకుని తరువాత దేవుడికి దండం పెట్టి మరొకసారి ప్రసాదాన్ని తయారుచేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి.