హిందువులు ఈ ఏడాది అనగా 2024 ఏప్రిల్ 17 బుధవారం రోజు శ్రీరామనవమి పండుగ జరుపుకోనున్నారు. ఈ శ్రీరామ నవమి పండుగ రోజున శ్రీరాముని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు ఆయన అనుగ్రహం కోసం అనేక దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలు కలగాలని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని వేడుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటుంటే శ్రీరామ నవమి పండుగ రోజు కొన్ని రకాల పనులు చేయాల్సిందే.
మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే. నవమి రోజున శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం. నవమి తిథి రోజున అమ్మవారికి తామర లేదా ఎర్రని పుష్పాలను సమర్పించాలి. అలాగే శ్రీ సూక్తం పఠించాలి. ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నవమి రోజున 5 గవ్వలు తీసుకుని, వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క దగ్గర ఉంచాలి.
ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహువు, కేతువులకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుంది. కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే.. కోరుకున్న కోరిక నెరవేరాలంటే నవమి రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున దుర్గా సప్తశతి మొత్తం పారాయణం చేయలేకపోతే కనీసం దాని పన్నెండవ అధ్యాయాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది.