సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తాము. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఆధ్యాత్మికపరంగా పవిత్రంగా భావించడం వల్ల తులసి మొక్కకు ప్రతిరోజు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇలా తులసి మొక్క ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండటం వల్ల మన ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని చెబుతారు.
ఇక చాలామంది ఎన్నో ముఖ్యమైన పనులనుప్రారంభించినప్పటికీ వారి పనులలో సక్సెస్ సాధించలేక తరచు అపజయం ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా చేపట్టిన పనులు విజయవంతము కాకపోతే తులసి వేర్లతో ఈ చిన్న పరిహారం చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.తులసి వేలం గంగాజలంతో కడిగి పూజ చేసిన అనంతరం ఆ పేర్లను పసుపు వస్త్రంలో కట్టి ఇంట్లో పవిత్రమైన చోట పెట్టడం వల్ల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు తులసి మొక్కకు ఉదయం నీరు పోసి సాయంత్రం దీపారాధన చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఇక గ్రహ దోషం కారణంగా కొంతమంది ఏ పని చేపట్టిన అపజయం అవుతుంటారు. ఇలాంటివారు తులసి వేర్లను వెండి తాయత్తులో పెట్టి కట్టుకోవటం వల్ల గ్రహదోషం తొలగిపోతుంది. ఇలా తులసి మొక్క వీర్ల ద్వారా ఎన్నో సమస్యలకు పరిహారం చేయవచ్చు.