వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు వంటగదిలో ఉంటే డబ్బుకు కొదవే ఉండదు!

హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మనం ఇంటిని నిర్మించాలన్న లేదా ఇంటిలో వస్తువులను అలంకరించుకోవాలన్న వాస్తు శాస్త్రానికి అనుగుణంగానే ఆ వస్తువులను అలంకరిస్తూ ఉంటాము.ముఖ్యంగా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో వంటగది విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. వంటగది సరైన స్థానంలో ఉండడం వల్ల ఆ ఇల్లు సకల సంపదలను కలిగి ఉంటుంది.అలాకాకుండా వంటగది విషయంలో వాస్తు లోపించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఎలా ఉండాలి ఏ ఏ వస్తువులు వంటగదిలో ఉండటం వల్ల మంచి కలుగుతుందనే విషయానికి వస్తే.. వంట గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులలో పసుపు ఒకటి పసుపు గురు గ్రహాన్ని చూసిస్తుంది కనుక వంట గదిలో ఎల్లప్పుడూ పసుపు తప్పనిసరిగా ఉండాలి. పసుపు వంట గదిలో ఖాళీ కాకుండా చూసుకోవాలి.వంట గదిలో ఎల్లప్పుడూ బియ్యం నిల్వ ఉండాలి. బియ్యం ఎప్పుడైతే వంట గదిలో ఉండవో శుక్ర గ్రహ ప్రభావం మనపై పడుతుంది. ఇంట్లో బియ్యం ఉండడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది.

వంట గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వాటిల్లో ఉప్పు ఒకటి ఉప్పు ముందుగానే ఇంట్లో నిల్వ చేసి పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఇంట్లో ఉప్పు లేకుండా ఉంటుందో ఆ సమయంలో మన ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. వీటితోపాటు ఆవాల నూనె తప్పనిసరిగా ఇంటిలో ఉండాలి. ఎప్పుడైతే మన ఇంట్లో ఆవాల నూనె ఉండదో ఆ సమయంలో శనీశ్వరుని కోపానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే తప్పనిసరిగా వంటగదిలో ఈ వస్తువులు ఎల్లప్పుడూ నిండుగా ఉండటం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలను కలిగి ఉంటారు.