చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఆడవారిలో ఉండకూడని ముఖ్య లక్షణాలు ఇవే..?

సాధారణంగా ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మి అని అంటారు. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన అమ్మాయి అత్తగారింటికి వెళ్లిన తర్వాత అనిగిమనిగి ఉంటూ మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఇలా స్త్రీ మంచి ఇల్లాలుగా గుర్తింపు పొందాలంటే వారిలో కొన్ని లక్షణాలు అసలు ఉండకూడదు. చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం మహిళల్లో ఉండే కొన్ని లక్షణాలు వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేయడమే కాకుండా కుటుంబంలో సమస్యలు తలెత్తెల చేస్తాయి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. కాబట్టి ఇంట్లో ఇల్లాలు మీద ఆ కుటుంబ గౌరవ మర్యాదలు ఆధారపడి ఉంటాయి. జానకి నీతి శాస్త్రం ప్రకారం మహిళల్లో ఉండకూడదని లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చాణక్యుడి నీతి శాస్త్రంలో వివరించబడిన నియమాలు పాటించడం వల్ల జీవితం సంతోషంగా సాగుతుందని ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కచ్చితంగా చాణక్య చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ఆచరించడం చాలా అవసరం. సాధారణంగా మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడటమే కాకుండా మన వ్యక్తిత్వం మీద కూడా మచ్చ పడుతుంది. చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం ఆడవారిలో ఉండకూడని ముఖ్యమైన లక్షణం అబద్ధం చెప్పటం. ఇంట్లో ఇల్లాలికి అబద్ధం చెప్పే అలవాటు ఉన్నట్లయితే ఆ ఇంట్లోనే సభ్యులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇలా అబద్ధం చెప్పే అలవాటు ఉండటం వల్ల ఆ ఇల్లాలికి ఇంట్లో సమాజంలో గౌరవం కూడా ఉండదు.

అలాగే ఇల్లాలికి ఉండకూడని మరొక ముఖ్యమైన లక్షణం భర్తతో గొడవ పడటం. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు సమరస్యంగా వాటిని పరిష్కరించుకోకుండా అందరి ముందు ఆ ఇల్లాలు భర్తపై అరవటం అతనితో గొడవ పడటం వల్ల వీరి ఇంటికొట్టు రచ్చకి ఎక్కుతుంది. ఇలా వీరి కుటుంబంపై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల భర్త తప్పు చేసినా కూడా నలుగురికి వినపడేలా భార్య భర్తపై గట్టిగా అరవకుండా నిదానంగా చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలి.

ఆడవారిలో ఉండకూడని మరొక లక్షణం ఏమిటంటే.. సాధారణంగా ఇంట్లో ఆడవారు వారి అనారోగ్యం గురించి భర్తకు తెలియకుండా దాంతో ఉంటారు. వారి అనారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అయితే ఇలా ఖర్చులకు భయపడి వారి అనారోగ్యం గురించి భర్తకు తెలియకుండా దాచటం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మహిళలు వారి అనారోగ్య విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి.