ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ఫేమస్ పండుగ. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. సంక్రాంతి.. ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు. వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటుంటారు.
ఈ నెలరోజులపాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. గొబ్బి పూలు.. అంటే ఇప్పటి తరానికి చాలా మందికి తెలియవు. గొబ్బిపూలు అంటే ఈ డిసెంబర్, జనవరి నెలలో వచ్చే బంతులు, చామంతులు ముగ్గుల్లో గొబ్బెమ్మల్లో పెడుతున్నారు. కానీ అవి గొబ్బిపూలు కావు. వాస్తవానికి గొబ్బి పూలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని మనం పూజల్లోకానీ, మహిళలు తమ తలకు కానీ అలంకరించరు. వీటిలో ప్రధానంగా పెట్టేది జిల్లేడు పూలను వాడతారు. మరికొంత మంది గోగిపూలు అని ఉంటాయి. గోగిపూలు అంటే పింక్ కలర్లో ఉంటాయి. వాటిని గోగిపూలు అంటారు వాటిని గొబ్బెమ్మల్లో అలంకరిస్తారు.
ఈ సిటీల్లో అవన్నీ దొరకడం కష్టం కావడంతో మార్కెట్లో దొరికే బంతి, చామంతులను తీసుకువచ్చి అలంకరిస్తున్నారు. అదేవిధంగా ఒక విధమైన రంగులో ఉండే గొబ్బిపూలను వాడాలి. ఇవి లక్ష్మిదేవికి అత్యంత ప్రీతికరమైనవి.