కొన్నేళ్లుగా సంక్రాంతిని సినీ పరిశ్రమ ఓ పండగగా చేసుకుంటోంది. పైకి ప్రజలకు వినోదాన్నిపంచుతున్నా.. సంక్రాంతి అంటే.. భారీ ఎత్తున వసూళ్లు, పెట్టుబడుల పర్వంగా టాలీవుడ్ ఓ రేంజ్లో వెనుకేసుకుంటోంది. ఈ ఏడాది కూడా ఇప్పటికే అల వైకుంఠపురం, సరిలేరు.. ఇలా పలు మూవీలు వ్యాపార సంక్రాంతిని ప్రారంభించేశాయి. ఆల్రెడీ మహేష్, బన్నీ బరిలోకి దిగిపోయారు. వసూళ్ళ విషయంలో ఒకరిని మించి మరొకరు దూసుకెళుతున్నారు. అటు ఓవర్సీస్లో కూడా హడావిడి మాములుగా లేదు. ఏ హీరో క్రేజ్‌ని బట్టి ఆ సినిమకి వసూళ్ళు భరీ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఇదిలా ఉంటే… భారీ మొత్తంలో ఈ కలెక్షన్ల హడివిడి మొదలైంది.
ఇదే ఊపు మీద పండగ రోజున వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ `ఎంత మంచివాడవురా` కూడా వస్తుంది. కళ్యాణ్‌రామ్ కెరియర్లో ఇదే మొదటిసారి సంక్రాంతి బరిలో దిగడం. పైగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆ చిత్రంపైన కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. మాములు జనం కన్నా సినిమా హీరోల సంక్రాంతి సందడే ఎక్కువగా ఉంటుంది. ఇక మరి ఇప్పటికే విడుదలైన రజనీకాంత్ `దర్బార్`, సూపర్‌స్టార్ మహేష్‌బాబు `సరిలేరునీకెవ్వరు` స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటించిన `అలవైకుంఠపురంలో` రిలీజ్ అయి సందడి మొదలెట్టేశాయి. మరి రేపు విడుదల కాబోయే కళ్యాణ్‌రామ్ `ఎంతమంచివాడవురా` ఏ రేంజ్లో దూసుకెళుతుందో వేచిచూడాలి. వీటన్నిటిని మించి ఆ చిత్రం వైరల్ అవుతుందా. లేదంటే సతీష్ రొటీన్‌గా తీశాడా అన్నది మరో ఇరవైనాలుగు గంటల్లో తేలనుంది. మరి ఇప్పటికే విడుదలైన సరిలేరు, అల చిత్రాల్లో భారీగా వసూళ్ళు చేసింది బన్నీ చిత్రమే. అయితే ఈసారి మాత్రం ఇప్పటి వరకు విడుదలైన మూడు చిత్రాల్లో ఫ్లాప్ టాక్ అయితే ఇంత వరకు రాలేదు. వసూళ్ళ సంగతి పక్కన పెడితే అన్ని చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి కానీ అసలు బాలేదు అన్న టాక్ ఏ చిత్రానికి రాలేదు. మరి నందమూరి హీరో ఏమనిపించుకుంటాడో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ సారి సంక్రాంతి సినిమా సందడి కాస్త జోరు బాగానే ఉంది.