యూత్‌ను భయపెడుతున్న యముడు (వీడియో)

హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోతాయని పోలీసులు అనేక రకాలుగా వాహనదారులకు చెబుతున్నా వారిలో మాత్రం మార్పు రావటం లేదు. భిన్నంగా ఆలోచించిన కర్నాటక పోలీసులు వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. కర్నాటక రాజదాని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా యమధర్మరాజు దిగొచ్చినట్టుగా యమపాశం వేసి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుంటే ప్రాణాలు పోతాయని హెల్మెట్ తో ప్రాణాలు నిలుస్తాయని వాహనదారులకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ కు టెంపర్ గ్లాసు, పౌచ్ లు వేసి జాగ్రత్తగా చూస్తాం మరీ ఎంతో ముఖ్యమైనటువంటి మన తలకేందుకు హెల్మెట్ పెట్టుకోమంటూ వారిని ప్రశ్నించారు. యమధర్మరాజు వేషధారణతో అవగాహన కల్పించడంతో ప్రజలంతా అవాక్కయి చూశారు. నిజమే పోలీసులు చెప్పేది మన జీవితాల కోసమే కదా అనుకుంటూ ప్రజలు, వాహనదారులు ముందుకు కదిలారు. యమధర్మరాజు దిగొచ్చిన వీడియో కింద ఉంది మీరూ చూడండి…

[videopress iUkYiOxN]