ఆకలితో ఉన్న భర్తకి అన్నం పెట్టకుండా పక్కింటి మహిళతో ముచ్చట్లు.. భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతూ ఉంటాయి. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు సమస్య తగ్గిపోయి యధావిధిగా కలిసిపోతూ ఉంటారు. అయితే మరి కొన్ని సందర్భాలలో మాత్రం భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం లేదా హత్యలు చేసేదాకా వెళుతూ ఉంటాయి. తాజాగా ఆకలితో వచ్చిన భర్తకు వంట వండి పెట్టకుండా పక్కింటి మహిళతో ముచ్చట్లు పెట్టిన భార్యని భర్త దారుణంగా చితకబాది హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దారుణ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పూర్తి వివరాలలోకి వెళితే…ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధా జిల్లాకు చెందిన సురేష్ బైగా (28) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు . ఈ నెల 7వ తేదీ కూడా పని నిమిత్తం బయటకు వెళ్లిన సురేష్ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. అయితే సురేష్ భార్య ఇంద్రావతి (24) తన భర్త భోజనానికి ఇంటికి వచ్చే సమయానికి వంట చేయకుండా పక్కింటి మహిళతో ముచ్చట్లు చెబుతూ కనిపించింది. అసలే ఆకలి మీద ఉన్న సురేష్ భార్య వంట ఉండకపోవడమే కాకుండా పక్కింటి మహిళతో మాట్లాడుతూ కూర్చోవడంతో తీవ్ర అగ్రహానికి గురయ్యాడు. భార్య మీద ఉన్న కోపంతో దుడ్డు కర్రతో ఆమె మీద దాడి చేశాడు.

సురేష్ విచక్షణ రహితంగా దాడి చేయడంతో మహిళ స్పృహ కోల్పోయాకక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే క్షణకావేశంలో సురేష్ చేసిన పనికి భార్య ఇలా ప్రాణాలు కోల్పోవడంతో సురేష్ కి ఏం చేయాలో అంతు చిక్కలేదు. వెంటనే పక్క వీధిలో ఉండే అత్తమామల ఇంటికి వెళ్ళి ఇంద్రావతికి మూర్ఛ వ్యాధి వచ్చిందని, వేగంగా నేలపై పడడంతో చనిపోయిందని చెప్పాడు .
దీంతో బాధితురాలు తల్లిదండ్రులు కట్టిన స్థలానికి వెళ్లే పరిశీలించగా అమె శరీరంపై దెబ్బలు కనిపించాయి. అనుమానం వచ్చిన ఇంద్రావతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. సురేష్ మీద అనుమానం ఉండటంతో అతనిని అదుపులోకి తీసుకొని ఇంద్రావతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.