వంగవీటి-టిడిపి డీల్ ఇంతేనా…

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే దాంట్లో అనుమానం లేదు. ఆయన టిడిపిలోకి వెళ్తాడనే రూమర్ పుట్టినప్పటి నుంచి విజయవాడ టిడిపిలో కలకలం మొదలయింది. కాపు నాయకు డి గా  పేరున్న వంగవీటి రాధాకృష్ణ పెద్ద డీల్ లో పెట్టుకునే టిడిపిలో చేరుతుంటాడని, ఎవరికో టిడిపిలో మూడిందని, ఆయన టికెట్ కోల్పోవలసి వస్తుందని ఒకటే వూహాగానాలు, విశ్లేషణలు. ఢిల్ ఉన్న మాట నిజమే కాని, అదంతా లాభసాటిగా లేదని అసలు విషయం తెలిస్తే అనిపిస్తుంది.

టిడిపి డీల్ ఎమిటో తెలుసా?

ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న వైసిపిని వదిలేసి, టిడిపిలో చేరాలనుకుందుకు  సెన్సేషనల్ డీలేమీ లేదు. అంతా పట్టింపులే. 

రాధా-టిడిపి  డీల్ విషయం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ రోజు వెల్లడించారు.

కొద్ది సేపటి కిందట ఆయన ముఖ్యమంత్రి కలిశారు. బయటకు వచ్చాక అసలు విషయం బయటపెట్టారు. వంగవీటికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని జలీల్ ఖాన్ చల్లగా చెప్పారు. వంగవీటి విజయవాడ సెంట్రలో , ఈస్ట్ అసెంబ్లీ సీటో అడుగుతారని అపుడెట్లా అని టిడిపి సిటింగ్ ఎమ్మెల్యేలు బెంబేలు పడుతున్నపుడు జలీల్ ఖాన్ ఈ చల్లటి కబురు చెప్పారు.