అన్న చనిపోయాక ఎన్టీఆర్ తో బాలకృష్ణ ఏం చెప్పాడో తెలుసా? (వీడియో)

నందమూరి హరికృష్ణ రోడ్ ప్రమాదంలో మృతి చెంది నందమూరి ఫ్యామిలీని అలాగే నందమూరి అభిమానుల్ని తీరని దిగ్భ్రాంతికి గురి చేసారు. అయితే ఇలాంటి టైం లో తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు బాలకృష్ణ తండ్రిలా అండగా నిలబడతారా లేదా అనేది అందరి ఆలోచన. ఈ తరుణంలో బాలయ్య… ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ముచ్చటిస్తున్న వీడియో ఒకటి బయటకి వచ్చింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
హరికృష్ణ ఇంట్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించాడు బాలకృష్ణ. అయితే గత కొన్నాళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఆ బాధ్యత తీసుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసారు. కాని అన్న మరణంతో బాలకృష్ణ కుమిలి పోవడంతో పాటు తన అన్న కొడుకులకు అండగా ఉండి ధైర్యంగా నిలబడాలని ముందుకు వచ్చారు. ఇది గొప్ప పరిణామం అని చాలా మంది అంటున్నారు. హరికృష్ణ మరణం బాధ కలిగించినా, కనీసం ఈ రకంగా అయిన ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసారు అనే ఒక చిన్న ఆనందంలో నందమూరి అభిమానులు ఉన్నారు. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూడవచ్చు.